అక్రమ కేసును రద్దు చేసి, వనకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్టను కాపాడాలి

Submitted by lenin guduru on Fri, 25/11/2022 - 20:35
CI

అక్రమ కేసును రద్దు చేసి, వనకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్టను కాపాడాలి

దేవరుప్పుల, నవంబర్ 25, (ప్రజాజ్యోతి):-జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్టకు అక్రమంగా మైనింగ్ పర్మిషన్ తెచ్చుకొని ఇటీవల రోహిత్ మినరల్ కంపెనీ అనే పేరుతో తవ్వకాలు జరిపారు అయితే ఆ సమయంలో ధర్మపురం కడవెండి మాదాపురం ఉమ్మడి గ్రామాల ప్రజలు మానకొండయ్య గుట్ట దగ్గరికి వెళ్లి అక్రమంగా చేస్తున్న మైనింగ్ను ఆపేశారు అయితే తర్వాత రోహిత్ మినరల్ కంపెనీకి చెందిన మొగిలి అనే వ్యక్తి కడవెండి గ్రామానికి చెందిన  పోతిరెడ్డి లీనారెడ్డి, దుబ్బాక రత్నాకర్ రెడ్డి, కాశ బోయిన నగేష్, నక్క రమేష్, తాటి పెళ్లి మహేష్, సుడిగెల హనుమంతు, పంతం సోమయ్య, పూజారి బీటుకూరి సంపత్ కుమార్ ఆచార్యులు, పెద్ది రవీందర్, పెద్ది సత్యనారాయణ, గుమ్మడవెల్లి సోమేష్, చెన్నూరి నర్సింగారావు, గంగరబోయిన మల్లయ్య పైన అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వారందరూ ఈరోజు స్థానిక ఎస్సై సీఐలను కలిసి సంబంధించిన పూర్తి వివరాలు వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము ఎలాంటి అక్రమాలకు గాని రోహిత్ పాల్ మినరల్ కంపెనీకి చెందిన అటువంటి సామాగ్రిని కానీ, సంబంధించిన వ్యక్తులను గాని ఎలాంటి ఇబ్బందులు పెట్టి వ్యతిరేక పనులు చేయలేదని వారు తెలిపారు. కావల్సుకొని కడవెండి గ్రామస్తులపైన రోహిత్ పాల్ అక్రమంగా కేసు పెట్టారని అన్నారు. ఎంతోమంది లక్ష్మీనరసింహస్వామి గుట్టపై ఆధారపడి ఉన్నారని తమపై పెట్టిన అక్రమ కేసును రద్దుచేసి, వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్టను కాపాడాలని కోరుతూ శుక్రవారం పాలకుర్తి సీఐ, దేవరుప్పుల ఎస్సై కి ఫిర్యాదు చేశారు.