వజ్రోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటాలి: సుడిగెల హనుమంతు

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 16:29
Vajrotsavam celebrations should be called Amber: Sudigela Hanumantu

దేవరుప్పుల సెప్టెంబర్ 16 ప్రజాజ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో గురువారం టిఆర్ఎస్ మండల పార్టీ అధికార ప్రతినిధి, కడవెండి గ్రామ మాజీ సర్పంచ్ సుడిగెల హనుమంతు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూతెలంగాణ విలీన దినోత్సవ సందర్భంగా రాచరిక వ్యవస్థనుండి ప్రజా స్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సహజ పరిణామ క్రమం సెప్టెంబర్ 17, 2022 నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సెప్టెంబర్ 17వ తారికును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటిస్తూ మూడు రోజులపాటు 16, 17, 18వ తేదీలలో జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించబోయే బహిరంగ సభకు, ర్యాలీ కి విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలు, టీఎర్ఎస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, భారీ ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని సుడిగెల హనుమంతు పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ గిరిజనుల ఆత్మ గౌరవం పెంచేలా ముఖ్య మంత్రి కేసిఆర్ ఆదివాసీ గిరిజన భవన్ నిర్మించడం అభినందనీయం అని అన్నారు. 17న గిరిజన భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.