అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చారిత్రాత్మక నిర్ణయం

Submitted by Upender Bukka on Wed, 14/09/2022 - 12:11
The unanimous resolution in the Assembly was a historic decision

తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 13( ప్రజా జ్యోతి )  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి  భారత రాజ్యాంగ నిర్మాత ,సంఘసంస్కర్త ,ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్లమెంట్ భవనంగా పేరు పెట్టాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళ వారం  అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం  హర్షనీయమని టిఆర్ఎస్ పార్టీ నాయకులు , మద్దెల మల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం  నిబద్ధతతో, చిత్తశుద్ధితో, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తుందో, అంతే నిబద్దతతో, చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం  ఆలోచన చేసి నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్   పేరు పెట్టి ఆ మహనీయునికి అంకితం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అసెంబ్లీ  తీర్మానానికి ఆమోదం తెలిపిన శాసనసభ్యులకు ,మంత్రులకు  కృతజ్ఞతలు తెలిపారు.