ఉద్యోగులపై దాడులు చేస్తే ఉపేక్షించం... మల్లిఖార్జున్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి..: ఉద్యోగ జే ఏ సి చైర్మన్ అలుక కిషన్

Submitted by SANJEEVAIAH on Wed, 18/01/2023 - 23:05
ఫోటో

ఉద్యోగులపై దాడులు చేస్తే ఉపేక్షించం 

మల్లిఖార్జున్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

ఉద్యోగ జేఏసీ చైర్మన్ అలుక కిషన్ 

నిజామాబాద్, ప్రజాజ్యోతి, జనవరి 18 :

కోటగిరి  ప్రభుత్వ ఉపాధ్యాయులు మల్లికార్జున్ పై జరిగిన ఘటనను జిల్లా ఎంప్లాయిస్ జే ఏ సి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నమని, దోషులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని టి ఎన్ జి వో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, కార్యదర్శి అమృత కుమార్ లు డిమాండ్ చేశారు. బుధవారం టి ఎన్ జి వో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడతూ ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పునరావృతం అయితే ఎంప్లాయ్ జే ఏ సి పక్షాన తీవ్రమైన నిరసనలు తెలియజేస్తామన్నారు. ఉద్యోగులపై దాడుల నివారణకు కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరిస్తామని అన్నారు. ఉపాధ్యాయులు మల్లికార్జున్ కు టీఎన్జీవోస్ పక్షాన అండగా ఉంటామని హామీ ఇస్తూ, జిల్లాలో గల ఉద్యోగ ఉపాధ్యాయుల  పైన అమానుషంగా, అకారణంగా దాడులు చేసిన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించమని తెలిపారు. రాజకీయాల కోసమో, వ్యక్తిగత కారణాలతో దాడులు చేస్తే తగిన బుద్ధి చెప్పేవరకు విశ్రమించబోమని అన్నారు. మల్లికార్జున్ ఘటనపై దోషులను ,వెంటనే అరెస్ట్ చేయాలని మరో మారు ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన జిల్లా చైర్మన్ అలుక కిషన్,  టిఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్ డిమాండ్ చేశారు.