ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:25
Tribute to Acharya Konda Laxman Bapuji

మహాదేవపూర్ సెప్టెంబర్ 21 ప్రజాజ్యోతి .../ మహాదేవపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి  ఘన  నివాళి అర్పించారు.తెలంగాణ రైతాంగ పోరాటంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా,తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ చివరి దశ వరకు పోరాడి తెలంగాణ రాష్ట్ర అవతరణ జరగక ముందే 2012 లో తుది శ్వాస విడిచారని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జల దృశ్యం లోనే టీ ఆర్ ఎస్ పార్టీ పురుడుపోసుకుందని,ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో పద్మశాలి కులంలో జన్మించి,న్యాయవాది పట్టా అందుకొని,స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని,స్వాతంత్య్రం వచ్చినాక వివిధ మంత్రి పదవులలో కొనసాగి,విశాలాంధ్ర ను వ్యతిరేకించి,తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ప్రజల మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ అని చల్ల తిరుపతిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, పంతకాని రాజు, సంగం బాలయ్య,  సింగిల్ విండో సొసైటీ డైరెక్టర్లు తోట సుధాకర్, సమ్మక్క, ఎండి ఇబ్రహీం,  తదితరులు పాల్గొన్నారు