మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన దేవరుప్పుల మండల గిరిజన నాయకులు

Submitted by bosusambashivaraju on Wed, 21/09/2022 - 13:19
Tribal leaders of Devaruppula mandal who met Minister Errabelli

దేవరుప్పుల, సెప్టెంబర్ 20, (ప్రజాజ్యోతి):-  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం 17 సెప్టెంబర్ న రాష్ట్ర లో ఉన్న గిరిజనలకు 10% రిజర్వేషన్, గిరిజన బంధు మరియు గిరిజనలకు సంస్కృతి సమావేశాలకు మరియు శుభాకార్యలకు నిర్వహించడం కొరకు సేవాలాల్ బంజారా భవన్, కొమురం భీమ్ భవన్, మరియు పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో సేవాలాల్ మేరమా యాడి దేవాలయం నిర్మాణానికి ఒక ఎకరం భూమి ఇప్పించి గుడి నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించినందుకు గాను మంగళవారం దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఆయా గ్రామాల గిరిజన నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీటన్నింటికీ సహకరించిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో మండల తెరాస సీనియర్ నాయకులు సేవాలాల్ నిర్మాణం కమిటీ ప్రధాన కార్యదర్శి ధరవత్ రాంసింగ్ నాయక్, కమిటీ సభ్యులు గుగులోత్ చిన్ననాయక్, మండలం తెరాస యూత్ అధ్యక్షులు బానోత్ నవీన్ నాయక్, మండలం ఎస్టీ సెల్ అధ్యక్షులు ధరవత్ గణేష్ నాయక్, ఎంపీటీసీ గుగులోత్ ఆశజ్యోతి భగవాన్, బానోత్ యాకు,లావుడియా ఉపేందర్, సర్పంచ్ లు కోక్యా నాయక్, రాజన్న నాయక్, శ్రీను, శంకర్, నెహ్రూ, బాలు. బానోత్ బాలు,  ఆనంద్,  సోమన్న,  వీరేష్, జీ వీరన్న, మధు, గెమా, మండల తెరాస నాయకులు గుగులోత్ రాంసింగ్, గుగులోత్ పవన్ నాయక్, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు టాన్సింగ్, శ్రీరాములు, దేవనాయక్, జీహిందర్, లాలు,రవి, హచ్ఛ, కిషన్ తదితరులు  పాల్గొన్నారు.