ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకునేవారు వాళ్ల ఆగడాలు మానుకోవాలి.

Submitted by Praneeth Kumar on Sat, 17/09/2022 - 06:50
Those who are playing with the future of the students should refrain from their actions.

ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకునేవారు వాళ్ల ఆగడాలు మానుకోవాలి.
'లేదంటే కలం ప్రచురించే కథనాలకు ఎంతటి వారైనా కటకటాలపాలు కావాల్సిందే'.

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 17ప్రజాజ్యోతి: నాణ్యమైన ఆహారం పెడితే విద్యార్థులు ఎందుకు భోజనం బాగలేదంటారు. సరియైన వసతులు లేవని ఎవరైనా విద్యార్థి ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేసి ఆ విద్యార్థినీ విద్యార్థులు మంచిగా చదవడం లేదు, అని తిట్టటం కొట్టడం చేస్తున్నారని పలు ఆరోపణలు నిజమేనా. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు సరైన భోజనం, వసతులు లేవు మేము ఇక్కడ ఉండలేము అని చెబితే, తల్లిదండ్రులు వార్డెన్, హెచ్ఎం ని, టీచర్స్ ని అడిగితే, మీ అబ్బాయి అమ్మాయిలు సరిగా చదవడం లేదు అందుకే ఏదో ఒక వంక చెప్తున్నారు. వాళ్లకి ఇక్కడ ఉండటం ఇష్టం లేక చెప్తున్నారు అంటున్నది వాస్తవమేనా. ఎస్టి హాస్టల్లో కంటికి గాయ మై హైదరాబాదులో ఉన్న విద్యార్థి పరిస్థితి అలా ఉంటే, కనీసం ఇంతవరకు హాస్టల్స్ పర్యవేక్షణ కి సంబంధించిన ఏ ఒక్క అధికారి గానీ, ఎస్టీ హాస్టల్ కు సంబంధించిన అధికారులు గానీ ఎవరు ఆ హాస్టల్ కి వెళ్లి హాస్టల్ వార్డెన్, హెచ్ఎం పై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఐటిడిఏ పిఓ హాస్టళ్లకు ఎవరిని అనుమతించకుండా పెట్టిన ఆంక్షలు ఎంత వరకు కరెక్ట్, అదే ఎవరు వెళ్లకపోతే ఆ విద్యార్థి పరిస్థితి ఎలా ఉండేది ఈ విషయం బయటకు వచ్చేదా. హైదరాబాదులో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న విద్యార్థి తరుపున ఎవరో ఒకరు ప్రశ్నించడం వల్లనే, ఈ రోజు ఆ బాబుకి కొంతమేరకు న్యాయం జరుగుతుంది.

◆ మొన్న హాస్టల్ బాలిక అదృశ్యం హై డ్రామా..!! (వార్డెన్ నిర్లక్ష్యంతో..).
బాలిక హై డ్రామా, అధికారుల సమయాన్ని దుర్వినియోగం చేసిన హాస్టల్ వార్డెన్ పూర్తిస్థాయిలో హాస్టలను పరిశీలించకుండా, అమూల్యమైన అధికారుల సమయాన్ని వృధా చేసిన వార్డెన్. మీడియా లేకపోతే ఏమయ్యేది, మీడియా అంతలా కవర్ చేసినా మేఘన పాపకు మతిస్థిమితం సరిగ్గా లేదని మరోలా ప్రచారం చెయ్యాలని చూసారు. పోలీస్ అధికారులు 8 బృందాలుగా 30 గంటలు గాలింపు చర్యలు ఒక హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లే హై టెన్షన్ బూర్గంపహాడ్ లో చోటుచేసుకుంది. ఏది ఏమైనా పాప క్షమంగా దొరకడం 30 గంటలు కంటి మీద నిద్ర లేకుండా పని చేసిన పోలీస్ అధికారుల కష్ట ఫలమే పాప ప్రాణాలతో దొరకడం. పలు జిల్లాలో పలుచోట్ల ఉన్న ఎస్టి, ఎస్సి గిరిజన గురుకుల బాల బాలికల హాస్టల్లో పరిస్థితి కొనసాగుతుందని చెప్పనక్కర్లేదు. కళ్ళకు కట్టినట్లు ఈ వారంలో జరిగిన సంఘటనలే ఉదాహరణ. ఇటీవల ఒక విద్యార్థి గిరిజన పాఠశాల నుండి బయట క్యాటరింగ్ చేస్తూ కనిపించడం, ఇలాంటి సంఘటనలు జరగడానికి గల కారకులు ఎవరు, వార్డెన్ ల నిర్లక్ష్యమా. వార్డెన్లకు అండగా ఉంటున్న కొన్ని పార్టీ కండవుల కప్పుకునే నాయకులా. హాస్టల్స్ లో ఇంత అన్యాయం జరుగుతున్నా, అటు అధికారులు గానీ ఇటు ప్రజాప్రతినిధులు గాని ఎందుకు పట్టించుకోవడం లేదు అంటున్న కొంతమంది సామాజిక కార్యకర్తలు, ప్రజలు. 'ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకునేవారు, వాళ్ల ఆగడాలు మానుకోకుంటే కలం ప్రచురించే కథనాలకు ఎంతటి వారైనా కటకటాల పాలు కావాల్సిందే' అంటున ప్రజలు.