జాతీయ విద్యా విధానంపై స్పష్టమైన చర్చ జరగాలి

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:59
There should be a clear discussion on the national education policy

నర్సంపేట సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి) .  భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యు ఎస్ ఎఫ్ ఐ )రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 19, 20, 21 తేదీలలో హనుమకొండ పట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయి సదస్సులను జయప్రదం చేయాలని కోరుతూ ఆహ్వాన సంఘం బ్రోచర్లు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి  చేతుల మీదుగా తమ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.ఆవిష్కరించిన అనంతరం గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి   మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు 42వ రాజ్యాంగ సవరణ లో విద్య కేంద్రం మరియు రాష్ట్రాల పరిధిలో ఉండేదని కానీ బిజెపి జాతీయ విద్యా విధానం పేరుతో హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.   యూనివర్సిటీలలో అందరికీ సమాన విద్యా అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం పేద వర్గాలు తీసుకునే ఫెలోషిప్ ను రద్దు చేయడం బాధాకరమన్నారు. విద్యను దూరం చేస్తూ పైకి మాత్రం నీతులు వళ్లించడం బిజెపికే చెందుతుందని ఎద్దేవా చేశారు. జాతీయ విద్యా విధానం వల్ల విద్య మరింత అంగడి సరుకుగా మారుతుందని కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారం చేసుకోవడం కోసంఈవిధానంఉపయోగపడుతుందని తెలిపారు.   ఇలాంటి విధానాలతో దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని తెలిపారు బిజెపి యొక్క అనైతిక విలువలను దేశ ప్రజానీకం గమనించాలని పిలుపునిచ్చారు.

ఈ జాతీయ సదస్సుకు అన్ని వర్గాల  వారు హాజరై జయప్రదం చేయాలని కోరారు.అనంతరం యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగలిచెర్ల సందీప్  మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిజెపి తీసుకొస్తున్న విధానాలపై మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు సామాజికవేత్తలు విద్యార్థి ప్రతినిధులు హాజరవుతున్నారని దీని జయప్రదం కోసం అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మార్కెట్ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ ఎస్ ఎఫ్ ఐ. వరంగల్ జిల్లా కన్వీనర్ సమ్మెట వర్షన్ . మరియు జిల్లా నాయకులు వేముల అజయ్.B పవన్. తదితర నాయకులు పాల్గొన్నారు