జిల్లా ఆసుపత్రిలో నీటి సౌకర్యం నిల్.. -రోగుల సహాయకులు నీటి కోసం పరుగులు..

Submitted by kosgi narsimulu on Fri, 30/09/2022 - 14:22
 There is no water facility in the district hospital. - Patient assistants run for water..

తాండూరు సెప్టెంబర్ 30 ప్రజా జ్యోతి :-   తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో వైద్యం కోసం  చేరిన రోగులకు సహాయకులుగా ఉన్న వారు నీళ్ళ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో చేరిన రోగుల సహాయకులు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చడానికి నీళ్ళు తీసుక రావడం కోసం  సుదూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి  నెలకొంది. ఆసుపత్రి పరిసరాలలో  నీటి కుళాయి లేక పోవడంతో  కొందరు డబ్బు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ నీళ్ళు కూడ అందించలేని దుస్థితి నెలకొందని చెప్పాలి. 200 పడకల ఆసుపత్రి ఉండడంతో కనీసం 150 మంది రోగులు ఇన్ పేషెంట్ గా ఉంటున్నారు. వారికి సహాయకులుగా మరో 150 నుండి 200 మంది ఉండడంతో నీటి సౌకర్యం లేక పోవడంతో  అల్లాడుపోతున్నామని రోగుల సహాయకులు వాపోతున్నారు. పేరుకే పెద్ద ఆసుపత్రి నీటి కోసం హోటల్ నిర్వహకుల వద్దకు పరుగులు తీయాలి. మంచినీళ్లు కావాలంటే కనీసం వారిని బ్రతిమాడాల్సిన పరిస్థితి నెలకొందని రోగుల సహాయకులు చెప్తున్నారు