కొండమడుగులో మేకల చోరీ

Submitted by krishna swamy on Wed, 21/09/2022 - 11:56
The theft of goats in Kondamaga

సంఘటన స్థలాని పరిశీలించిన సోము రమేష్ కురుమ గొర్రెల మేకల పెంపకదారుల సంఘం మండల అధ్యక్షులు 

బిబినగర్, సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి) ,,../ మండలంలోని కొండమడుగు గ్రామానికి చెందిన చిలకగూడెం సత్తయ్య వృత్తి రీత్యా మేకలను సాదుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీలాగే గొర్రెలను మేపుకొని సాయంత్రం సమయంలో  దొడ్డిలోకి తొలడం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు గొర్రెలను ఒక పొట్టేలును ఒక్క మేకను దొంగలు ఎత్తుకొని పోవడం జరిగింది. వీటి విలువ సుమారు 65000 వేల రూపాయలు వరకు ఉంటుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న గొర్రెల మేకల పెంపకదారుల సంఘం బీబీనగర్ మండల అధ్యక్షులు సోము రమేష్ కురుమ సంఘటన స్థలాని పరిశీలించి మద్దూరి సత్తయ్య గొర్ల కాపరి   కురుమను పరామర్శించారు. అలాగే మనోధైర్యం చెప్పి దొంగతనం ఎలా జరిగింది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోమ్ రమేష్ కురుమ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి బాధితుని తగిన నష్టపరిహారం ఇవ్వవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చీర ఐలయ్య కురుమ కడం బక్కయ్య కురుమ మిరాల మైసయ్య కురుమ దొమ్మిడికే బాల నరసింహ దర్వాజా బాల మల్లయ్య కురుమ దర్వాజా ఐలయ్య కురుమ తదితరులు పాల్గొన్నారు.