తమ్మడపల్లిలో కార్డన్సెర్చ్. అనుమతులు లేని వాహనాలను సీజ్ . నర్మెట సీఐ నాగబాబు

Submitted by lenin guduru on Wed, 30/11/2022 - 19:11
నాగబాబు

తమ్మడపల్లిలో కార్డన్సెర్చ్.

  •  అనుమతులు లేని  వాహనాలను సీజ్ 

  • నర్మెట సీఐ నాగబాబు

బచ్చన్నపేట, నవంబర్ 30, (ప్రజాజ్యోతి):-
మండలంలోని తమ్మడపల్లిలో మంగళవారం రాత్రి బచ్చన్నపేట పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోకి అపరిచితులు వచ్చారా..? అనుమతి
పత్రాలు లేకుండా వాహనాలు కలిగి ఉన్నారా..? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం సీఐ నాగబాబు మాట్లాడుతూ గ్రామాల్లో యువత సన్మార్గంలో నడువాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామాభి
వృద్ధికి కలిసి రావాలని సూచించారు. విద్యార్థులు చదువులో రాణించి తల్లి
తండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే
ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. చిన్న పిల్లలకు ద్విచక్రవాహనాలు ఇవ్వొద్దన్నారు. 
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల కవితరాజు. బచ్చన్నపేట ఎస్సై నవీన్ కుమార్, తరిగొప్పుల ఎస్సై నరేశీయాదవ్,  నర్మెట ఎస్సై జానీ పాషా,గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు
పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.