అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ అడుగులు

Submitted by krishna swamy on Wed, 28/09/2022 - 10:19
Telangana steps towards development
  • రాష్ట్రం ఏర్పడ్డకే మౌలిక వసతులు మెరుగు పడ్డాయి
  • సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో
  • అభివృద్ధిలో కలిసి రండి- ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి
  • కోట్ల 56 లక్షలతో 10 కిలోమీటర్ల  బిటి రోడ్డు పనులకు శ్రీకారం


భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి).//... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాల్లో మున్సిపాలిటీలలో మౌలిక వసతులు మెరుగు పడ్డాయి అని,గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు  మున్సిపాలిటీలకు ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించలేదని, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మన సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోనీ మున్సిపాలిటీలు మరియు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. పట్టణములోని  ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమములో ఎమ్మెల్యే పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. తదనంతరము మండల పరిషత్ కార్యాలయము నందు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగ్ భూదాన్ పోచంపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి కొత్తగూడెం వరకు ఆర్ అండ్ బి నిధులు 3 కోట్ల 56 లక్షల విలువతో 10 కిలోమీటర్ల  బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల పట్టణ అభివృద్ధికి పట్టణ ప్రజలు  అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్ ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్ రెడ్డి జడ్పీటిసి కోట పుష్పలత మల్లారెడ్డి వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్ వైస్ ఛైర్మన్ బాత్క లింగస్వామి ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్ టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు సీత వెంకటేష్ కౌన్సిలర్లు పెద్దల చక్రపాణి గుండు మధు కర్నాటి రవీంధర్ సామల మల్లారెడ్డి దేవరాయ కుమార్ టీఆరెస్ ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేష్ గౌడ్, బాల నర్సింహ, సీత శ్రవణ్, చింతకింది కిరణ్, వేముల సుమన్ అధికారులు అనాధికారులు తదితరులు పాల్గొన్నారు.