బస్తీ దవాఖానను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

Submitted by Sandeepreddy b… on Wed, 07/09/2022 - 19:12
Telangana State Labor Minister Chamakura Mallareddy inaugurated Basti Dawakhana
  • కార్యక్రమంలో పాల్గొన్న పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి

మేడిపల్లి  సెప్టెంబర్7 ప్రజాజ్యోతి ; పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ లో, 4వ డివిజన్ లక్ష్మి నగర్ కాలనీ లో  ఏర్పాటు చేసిన  బస్తీ దవాఖాన నూతన భవనాలను తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి   చామకూర మల్లారెడ్డి  ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణాల్లో బస్తీ దవాఖానాలు  ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బస్తీ దవాఖానాల్లో అవుట్​పేషెంట్​సేవలు అందించడం పాటు బీపీ, షుగర్‌తో సహా 57 రకాల వైద్య పరీక్షలను చేస్తున్నారని తెలిపారు . అదేవిధంగా దవాఖానలో  150 రకాల మందులను ఉచితంగా అందిస్తారని ఆయన పేర్కొన్నారు. స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించడంతో పాటు టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారన్నారు.

బస్తీ దవాఖానాల్లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు అందుబాటులో ఉండి. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు అందిస్తారు ఆని తెలిపారు ఈ కార్యక్రమంలో కమీషనర్ దా. పి రామకృష్ణ రావు, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కొ ఆప్షన్ సభ్యులు, నాయకులు డిఈ శ్రీనివాస్, ఏఈ వినీల్, సానిటరీ  ఎస్ఐ జానకి,  తదితరులు పాల్గొన్నారు.