జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

Submitted by bheemaraidu on Wed, 14/09/2022 - 18:20
Telangana National Unity Vajrotsavam should be successfully organized in the district

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 14 :బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి మూడు రోజుల పాటు నిర్వహించు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 సి.ఎస్.సోమేష్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు కట్టుదిట్టంగా నిర్వహించాలని, 16న ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే ర్యాలీ రూట్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లో  ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల సహకారంతో 15 వేల మందితో భారీ ర్యాలీ, సమావేశం నిర్వహించాలని, ప్రజలందరికి  నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు.  భారి సంఖ్యలో ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో భోజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, అధిక సంఖ్యలో కౌంటర్లు మండలాల వారీగా ఏర్పాటు చేయాలని సూచించారు. 17న జిల్లా కేంద్రాల్లో  ముఖ్య అతిథిచే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని, హైదరాబాద్ లో జరిగే ఆదివాసీ భవన్, బంజారా భవన్ ప్రారంభానికి జిల్లా కు కేటాయించిన లక్ష్యాల మేరకు ఎస్టీలను తరలించాలని,  బస్సు,భోజన సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు విడుదల చేసామని తెలిపారు.

సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రముఖ కళాకారులను, స్వాతంత్ర సమరయోధుల సన్మానం చేయాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన భవనాలు ట్రై కలర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్సు లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లా లో  మూడు రోజుల పాటు జరిగే వజ్రోత్సవాల నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు చేస్తునామని, జిల్లా నుండి  మూడు బస్సులలో ఎస్టి ప్రజా ప్రతి నిధులు మరియు ఉద్యోగస్తులు , అందరు బయల్దేరుటకు ఏర్పాట్లు చేసామని, ర్యాలి మరియు భోజనాల  ఏర్పాట్లు  చేస్తునామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సు లో జిల్లా ఎస్ పి. రంజన్ రతన్ కుమార్, ఆర్ డి ఓ రాములు జాడ్ పి సి ఇ ఓ విజయనయాక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.