బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:56
Telangana Liberation Day celebrated under the leadership of BJP

 పలిమెల ప్రజాజ్యోతి సెప్టెంబర్ 17 // పలిమెల మండల కేంద్రంలో జాతీయ జెండాను  బిజెపి పలిమెల మండల అధ్యక్షులు కోయల్ కార్ నిరంజన్ ఎగరవేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం 19 47న వస్తే మనకు 1948న నిజాం రజాకార్ల నుండి మన తెలంగాణ రాష్ట్రం విముక్తి కలిగిందని అసలైన స్వతంత్రం మనకు ఈ విధంగా తెలంగాణకు రావడం జరిగిందని అదేవిధంగా రజాకారుల పాలనలో తెలంగాణలోని ప్రజలు అనేక విధాలుగా కూడా కష్టాలు పడుతూ చాలా ఇబ్బందులకు గురవడం జరిగిందని ఆనాడు ఈ రజాకారుల వికృత చేష్టల ద్వారా తెలంగాణలోని ఆడపడుచులను బట్టలు లేకుండా బతుకమ్మ ఆడ నివ్వడం అనేది వారి యొక్క నిరంకుశ మూర్ఖత్వానికి నిదర్శనమని అలాంటి రజాకారుల  విముక్తి కోసం ప్రజలు ఎంతో మంది తమ ప్రాణాలు సైతం అర్పించి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రత్యేక చెరువుతో ఈ రోజున మనకు స్వతంత్రం రావడం జరిగిందని ఆయన అన్నారుఆనాడు ఏదైతే రజాకారులకు స్వతంత్రం కోసం రజకారుల విముక్తి కోసం పోరాటం చేసాము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధమైన పరిపాలన కొనసాగుతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాబట్టి ఈ కేసీఆర్ గారి విముక్తి కోసం ప్రజలందరూ కూడా కలిసికట్టుగా పోరాడి ఆయనను గద్ద దింపే రోజు దగ్గరలోనే ఉందని ప్రజలందరూ కూడా కాషాయం జెండా వైపు చూస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో  మండల ప్రధాన కార్యదర్శి బాలు ఓబీసీ మచ్చ మండల అధ్యక్షులు జయకర్ బూత్ అధ్యక్షులు రాజు పోషమల్లు తదితరులు పాల్గొనడం జరిగింది.