పేదల సంక్షేమనికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Submitted by sai teja on Sat, 01/10/2022 - 10:37
 The Telangana government is giving importance to the welfare of the poor

 ప్రతి ఇంటికి  సంక్షేమ ఫలాలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
 
 అర్హులందరికీ ఆసరా పింఛన్లు

 ప్రతి పండుగలో ప్రభుత్వ భాగస్వామ్యం

 ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

 అనంతగిరి, సెప్టెంబర్30,(ప్రజా జ్యోతి):   నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం అనంతగిరి మండల పరిధిలోని వసంతపురం,వాయిల సింగారం, గోల్ తండ, పాత గోల్ తండా, గ్రామాలలో ఏర్పాటు చేసిన నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డుల పంపిణీ,బతుకమ్మ చీరల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూబతుకమ్మ ఉత్సవాలు, దేవీ నవరాత్రి, దసరా ప్రజలందరికీ  శుభాకాంక్షలు తెలిపారు.మన సాంప్రదాయాలు కరువైవుతున్న వేల మన పండుగల ద్వారా ఐక్యతను చాటాలి సంప్రదాయలను కాపాడాలి అని ఈ బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుకోవటమే కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డకు చీరాల పంపిణీ కార్యక్రమం చెప్పటం జరిగిందని అయన అన్నారు. రాజకీయాలకతీతంగా  చేస్తున్న ఒకే ఒక ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వంఅని అన్నారు.కోటి మందికి బతుకమ్మ చీరాల పంపిణీ చేపట్టిన కేసీఆర్.అర్హులైన ప్రతి ఒక్కరు లబ్ది పొందే విధంగా ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 12 వేల కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని స్పష్టం చేశారు. వృద్ధాప్య పెన్షన్ వయస్సును 65 సంవత్సరాల  నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం  ఇటీవల కాలంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించించి, ఆర్థిక సాయం అందజేశారు. 


.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, సర్పంచుల పోరం అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, టిఆర్ఎస్ నాయకులు వెంపటి వెంకటేశ్వర్లు, ఈదుల కృష్ణయ్య, వెంకట్ రెడ్డి,స్వరూప రెడ్డి, పుల్లయ్య గౌడ్, మటపల్లి శ్రీనివాస్ గౌడ్, సైదులు,కంటు నాగర్జున,ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోతు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్  బుర్ర వెంకటేశ్వర్లు,ఆయా గ్రామాల సర్పంచులు  శ్రీనివాసరావు, బుర్ర రజిత,బుజ్జి శ్రీనివాస్ నాయక్, నాగార్జున, టిఆర్ఎస్ నాయకులు నాగరాజు, వెంకటయ్య, బిక్షం నాయక్, చిన్న వెంకన్న, గుండ్లపల్లి వెంకన్న, గద్దె రఘు, రవి, శంకర్ నాయక్, చరణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.