పండుగ వేళ వీఆర్ఏలకు అండగా తహసిల్దార్ కార్యలయం

Submitted by Degala Veladri on Tue, 04/10/2022 - 23:07
Tehsildar's office under the VRAs during the festival

నిత్యవసర సరుకులు,బియ్యం పంపిణీ చేస్తున్న తహసిల్దార్

బోనకల్, అక్టోబర్ 04, ప్రజాజ్యోతి: రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం జులై 25 నుంచి నిరవధిక సమ్మె చేస్తూ మంగళవారంతో 72వరోజు గడుస్తున్న సందర్భంగా వీఆర్ఏలు ఆర్థికపరంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ రావూరి రాధిక మరియు కార్యాలయ సిబ్బంది బోనకల్ మండల వీఆర్ఏలకు దసరా కానుకగా వీఆర్ఏల ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా 33 మంది వీఆర్ఏ లకు 25 కెజి ల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ 72 రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. తాము నిరసన దీక్షలో ఉంటున్న సమయంలొ పండుగ వేళ విఆర్ఏ ల కుటుంబాలకు అండగా నిలిచిన తహశీల్దార్ రావూరి రాధిక, నాయాబ్ తహశీల్దార్ సంగు శ్వేతా, గిర్థవర్లు జీ లక్ష్మణ్, సత్యనారయణ ,కార్యాలయ సిబ్బంది కి మండల వీఆర్ఏల తరుపున ప్రత్యేక ధన్యవాదాలతో పాటు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.