ఉపాధ్యాయులకు త్వరలోనే బదిలీలు పదోన్నతులు పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:53
Teachers will soon be transferred and promoted  PRTU district general secretary Kusunapu Kiran

  రేగొండ,19 సెప్టెంబర్ ప్రజాజ్యోతి :   ఉపాధ్యాయులకు త్వరలోనే పదోన్నతులు మరియు బదిలీలు ఉంటాయని భూపాలపల్లి జిల్లా పిఆర్టియు ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ తెలియజేశారు. రేగొండ మండలంలో పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బాగిర్తి పేట ఉన్నత పాఠశాలలో అతను మాట్లాడుతూ  పిఆర్టీ యు రాష్ట్ర శాఖ సమాచారం మేరకు త్వరలోనే రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు ఉంటాయని అతను మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్టియు మండల అధ్యక్షుడు దుస్సా సుధాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు కేవలం పిఆర్టియుతోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. రేగొండ మండలంలో సోమవారం నాడు వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పండుగలా జరుపుకున్నామన్నారు. మండల పిఆర్టియు ప్రధాన కార్యదర్శి సూదం సాంబమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారాన్ని చూపగలిగే సత్తా కేవలం పిఆర్టియుకే ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు,   ఈ పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కోరే బిక్షపతి, పీవీ జి. కృష్ణ, ఎల్లంకి బిక్షపతి, కట్టగాని సంతోష్ బాబు, గుండు రవీందర్, కామెడీ సతీష్ రెడ్డి, పాకాల శ్రీనివాస్ రెడ్డి, అయిత మహేందర్, కొండ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు ఇంద్రసేనారెడ్డి, వేల్పుల రాజు, ఓన పాకల రాజయ్య, అంకం శ్రీనివాస్, సుధమల్ల మురళి, అనురాధ, గుండా రమేష్, చిన్న సరిత చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.