బతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడు

Submitted by sridhar on Mon, 05/09/2022 - 17:15
A teacher is an employee who shows the way to life from school
  • ఎంపీడీవో శ్రీధర్ 
  • 75 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మక్తల్, సెప్టెంబర్ 5, ( ప్రజా జ్యోతి న్యూస్) ; భారతదేశంలో పాఠశాల లేని పల్లెటూరు అయినా ఉండవచ్చేమో కాని ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండదని, బ్రతుకు తెరువు కోసం పాఠాలు చెప్పుకునే ప్రతి వ్యక్తి, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమేనని ఎంపీడీవో సురేందర్ అన్నారు.

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని, మక్తల్ విశ్రాంతఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ,శ్రీ సత్యసాయి, షిరిడి సాయి మందిరంలో సోమవారము అధ్యక్షుడు బి.గోపాలం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ,ముఖ్య అతిథిగా ఎంపీడీవో, శ్రీధర్ తాన్ సింగ్ బాలాజీ జ్యువెలర్స్ వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని వారిని గౌరవించడం చాలా ఆనందంగా ఉందని, సమాజంలో ఉపాధ్యాయునికి గల గౌరవము ఎవరికి ఉండదని ,ఈ సందర్భంగా 75 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులను వారు శాలువా మెమొంటోని అందజేసి ఘనంగా సన్మానించారు

.ఈ కార్యక్రమంలో ఉట్కూరు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి చందులాల్, కనకప్ప మాట్లాడుతూ మక్తల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషమని వారు తెలిపారు. అధ్యక్షుడు బి.గోపాలము  మాట్లాడుతూ విశ్రాంత ఉపాధ్యాయులను ప్రోత్సహించడానికి, ఉత్తేజపరచడానికి ,వారిలో మానసిక ఉల్లాసాన్ని నింపడానికి కార్యక్రమాన్ని నిర్వహించామని, సన్మాన కార్యక్రమం నిర్వహించడానికి తాన్ సింగ్ బాలాజీ జ్యువెలర్స్ పూర్తి సహకారం అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే 80 మందికి భోజన వసతి కల్పించిన విశ్రాంత ఉపాధ్యాయులు సిద్ధి లింగయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బి.గోపాలం, కార్యదర్శి బి భాస్కర్, గౌరవ అధ్యక్షులు జి నాగప్ప, బి సంజన వెంకట్ రెడ్డి కోశాధికారి సిద్ధిలింగయ్య ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్ ,కిష్టయ్య గౌడ్ సుజాత ,నర్సమ్మ ,విద్యావతి తులసప్ప ,జనార్ధన్ ,గోవింద్ 80 మంది నిశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.