Nagarjuna Sagar Constituency

బుద్ధవనం సందర్శనానికి విద్యార్థులకు రాయితీ

Submitted by kareem Md on Sat, 03/09/2022 - 10:25
  •  ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్  బుద్ధవనం

నాగార్జునసాగర్,సెప్టెంబర్02(ప్రజా జ్యోతి) ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు బౌద్ధ క్షేత్రం బుద్ధవనం సందర్శనకు వచ్చే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి (శనివారం) వచ్చే విద్యార్థులకు 50 శాతం రాయితీ అమలు చేస్తున్నామని తెలిపారు. రేపటి నుంచి ఇది విద్యార్థులకు వర్తిస్తుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. విద్యార్థులతో పాటు వచ్చే తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఈ రాయితి వర్తిస్తుందని తెలిపారు.

రైతు భాందవుడు వైయస్సార్

Submitted by Sathish Kammampati on Fri, 02/09/2022 - 18:19

వైయస్సార్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి

హాలియా,సెప్టెంబర్ 02(ప్రజా జ్యోతి): రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపిన మహానీయుడు వైయస్సార్ అని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శుక్రవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని నాగార్జునసాగర్ హాలియా మున్సిపాలిటీ లో ఘనంగా నిర్వహించారు.

నాగార్జునసాగర్‌ జలాశయం 18గేట్లు ఎత్తివేత ఎస్‌ఈ ధర్మానాయక్‌

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 18:48
  • ఇన్‌ ఫ్లో -1లక్ష 88వేల 668క్యూసెక్కులు 
  • 18క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల
  • వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మానాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌,సెప్టెంబర్01(ప్రజాజ్యోతి): కృష్ణానది వరద కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్‌ జలాశయం 18క్రస్ట్ గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్‌ ఈ ధర్మానాయక్‌, డీఈ పరమేష్‌లు తెలిపారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు: తేరా చిన్నపరెడ్డి

Submitted by Sathish Kammampati on Tue, 30/08/2022 - 16:48

నిడమనూరు(నాగార్జున సాగర్ ),ఆగస్టు30(ప్రజాజ్యోతి):నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు తేరా చిన్నపరెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలకు సకల దేవగణాలకు అధిపతి, తొలిపూజ అందుకునే వినాయకస్వామి భాద్రపద మాసం చతుర్ధి రోజున జన్మించిన కారణంగా బుధవారం  దేశ ప్రజలంతా వినాయక చవితి పండుగను జరుపుకుంటారు.

విఘ్నేశ్వర స్వామిని ప్రార్ధించడం వల్లన సకల ఆటంకాలు వైదొలగి సకల కార్యసిద్ధి సిద్ధించి ఆనందమయ జీవితం ప్రాప్తించాలని తేరా చిన్నపరెడ్డి కోరారు.  విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత వినాయకుడు.