నల్గొండ

గుండె ఆరోగ్యానికి ''పనస'' పండు మేలు

Submitted by venkat reddy on Wed, 14/09/2022 - 16:30
  • రక్త పోటును క్రమబద్దీకరించటంలోనూ సహాయకారిగా
  • పనస పండు

నిడమనూరు, సెప్టెంబర్14(ప్రజాజ్యోతి): పనస పండు మంచి రుచితోపాటు ఆరోగ్యానికి తోడ్పడే అనేక పోషకాలను కలిగి ఉంది. ఈ పండులో విటమిన్, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు, పొటాషియం, ఫైబర్, కొవ్వు, కొలెస్ట్రాల్ లేదా సంతృప్త కొవ్వులతోపాటు అనేక పోషకాలు ఉన్నాయి. రుచికరమైన పనస పండు హృదయానికి మేలుచేసేదిగా నిపుణులు సూచిస్తున్నారు. రుచి, ఆకృతితోపాటు పండిన తరువాత దాని రుచిని ఆస్వాధించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. పచ్చి పండ్లను రుచికరమైన వంటలలో ఉపయోగిస్తారు.

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి

Submitted by kareem Md on Wed, 14/09/2022 - 16:14
  •  జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్
  • ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజన విద్యార్థి సంఘం.

హలియా,సెప్టెంబర్(ప్రజా జ్యోతి) : గిరిజనుల జనాభా  ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం 
హాలియా మున్సిపాలిటీలో తెలంగాణ గిరిజన సంఘం అనుముల మండల కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులకు 10 రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

జనరల్ బాడీ లో మాట్లాడుతున్న ఎంపీపీ గుత్తా ఉమా దేవి

Submitted by veeresham siliveru on Wed, 14/09/2022 - 15:11
  • ఒక్క పంచాయతీకైనా కేంద్ర ఉత్తమ అవార్డు రావాలి- ఎంపీపీ గుత్తా ఉమాదేవి

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 14 , ప్రజా జ్యోతి : సంస్థాన్ నారాయణపురం మండలంలోని ఒక్క గ్రామపంచాయతీకైనా కేంద్ర ప్రభుత్వ ఉత్తమ అవార్డును సాధించాలని మండల పరిషత్ అధ్యక్షురాలు గుత్తా ఉమా ప్రేమ్చందర్ రెడ్డి కోరారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం నాడు ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 14 అంశాలను పరిగణలోనికి తీసుకుంటూ ఉత్తమ గ్రామపంచాయతీలను దేశవ్యాప్తంగా ఎంపిక చేస్తుందని తెలిపారు.

కులం పేరుతో దూషించిన ఎస్సైను విధుల్లో నుండి తొలగించాలి

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 12:40
  • నకిరేకల్  ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య                     

 నల్లగొండ సెప్టెంబర్ 14(ప్రజా జ్యోతి): ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎస్సి కాలనీలో దళితులను కించపరిచేలా మాట్లాడిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎస్ ఐ  స్రవంతి రెడ్డి వ్యాఖ్యలను నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు, ఒక బాధ్యత గల స్థాయిలో ఉండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులే ఇలా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పుల్ల మల్లయ్య

Submitted by sridhar on Tue, 13/09/2022 - 19:53

 చిట్యాల ప్రజా జ్యోతి :సెప్టెంబర్ 13,ఇటీవల మరణించిన మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన పాముకుంట్ల పోచయ్య  కుటుంబ సభ్యులను ఏవైయస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు.

సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి

Submitted by venkat reddy on Tue, 13/09/2022 - 14:10
  • సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను 
  •  అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పిస్తున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను 

 నిడమనూరు, సెప్టెంబర్ 13(ప్రజాజ్యోతి):కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిరంకుశ విధానాలపై ప్రజలు నాటి తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరవీరులను గుర్తు చేసుకున్నారు. అనంతరం  అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కస్తూర్భిగాంధీ విద్యార్థులకు దాహం తీర్చిన డిసిసిబి డైరెక్టర్ విరిగినేని అంజయ్య

Submitted by venkat reddy on Tue, 13/09/2022 - 11:01

నిడమనూరు,సెప్టెంబర్12(ప్రజాజ్యోతి): నిడమనూరు మండలకేంద్ర శివారులోని కస్తూర్భిగాంధీ పాఠశాలలో  మంచినీళ్ల పైపులైను డ్యామేజ్ కావడంతో గత రెండు నెలలుగా కస్తూర్భిగాంధీ పాఠశాల విద్యార్థినిలకు నీళ్లు సరఫరా కాకపోవడంతో విద్యార్థినిలకు ఇబ్బందులు పడుతుండడంతో సోమవారం డిసిసిబి డైరెక్టర్ విరిగినేని అంజయ్య అధ్యాపక బృందం విన్నవించుకోవడంతో తక్షణమే స్పందించి వెంటనే సుమారు రూ.10 వేలు సొంత ఖర్చులతో పైప్ లైన్ మరమ్మతులు చేయించి పాఠశాల విద్యార్థినిల సమస్యలు తీర్చడంతో  విద్యార్థినిల హర్షం వ్యక్తం చేశారు.

వరిపంటలో సుడి దోమ ఉదృతి నివారించేందుకు సస్యరక్షణ చర్యలు

Submitted by venkat reddy on Tue, 13/09/2022 - 10:54

నిడమనూరు, సెప్టెంబర్12(ప్రజాజ్యోతి) : వరిపంటను తీవ్రంగా నష్టపరుస్తున్న సమస్యల్లో సుడిదోమ ఒకటి. ఇది వరి కంకులు ఏర్పడే దశలో పంటను ఆశిస్తుంది. ఈ కీటకాలు ఆకులు, కాడల మధ్య ప్రాంతంలో కాండాల ఎగువ భాగంలో కనబడతాయి. ఆకుల నాళాల కణద్రవ్యాన్ని తినేసి కణజాలలను నష్టం కలిగిస్తాయి. దీంతో మొక్క నీరు, పోషకాలను కోల్పోవటం, ఆకులు వాడిపోవటం, మొక్కల ఎదుగుదల లేకపోవటం జరుగుతుంది. వరి కంకులపైన దాడి చేస్తాయి. దీంతో కంకులు గోధుమ రంగులో, నల్లటి చీలిన గింజలు తో కనిపిస్తాయి. దిగుబడి తగ్గుతుంది. తెగులు తీవ్రత అధికమైతే మొక్కలు చనిపోతాయి.

అడ్డగూడూర్ మండల కేంద్రంలో నూతన సంత ( అంగడి ) ఏర్పాటు

Submitted by sudhakar on Tue, 13/09/2022 - 10:50
  • నూతన సంత కరపత్రాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ ఎం పి టి సి

 అడ్డగూడూర్ సెప్టెంబర్ 12 ( ప్రజా జ్యోతి ) అడ్డ గూడూరు మండల కేంద్రంలో శుక్రవారం సంత (అంగడి)ఏర్పాటు చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము అని  పరిసర ప్రాంత ప్రజలు అడ్డగూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసే వారం సంత( అంగడి ) లో పండ్లు కూరగాయలు ఆకుకూరలు గొర్లు మేకలు మరియు పశువులను అమ్మకం మరియు కొనుగోలు చేసుకోవచ్చు అని అడ్డగూడూరు మండల పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అమ్మకాలు కొనుగోలు చేయడానికి దూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది కావున అట్టి సమస్య లేకుండా మన దగ్గర మంచి తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు మేకలు పశువులను కొన

జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

Submitted by Sathish Kammampati on Tue, 13/09/2022 - 10:22
  • జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి 

నల్లగొండ సెప్టెంబర్ 12(ప్రజాజ్యోతి)ప్రతినిధి: ఈ నెల 16,17,18 తేదీ లలో నల్గొండ నియోజక వర్గ కేంద్రం లో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రొత్సవాలు విజయ వంతం గా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.సోమవారం అర్.డి. ఓ కార్యాలయం లో   నల్గొండ నియోజక వర్గ ఎం.పి.డి. ఓ.లు,తహశీల్దార్ లు,మున్సిపల్,విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహణ పై పలు సూచనలు చేశారు.