వెంకటాపురం

ఆదివాసీ ప్రజా ప్రతినిధులను నిలదీసిన ప్రజలు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:20


  ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను నిర్బంధించిన ఆదివాసీలు

  ఆదివాసీల పై మాటల దాడికి దిగిన ఆదివాసీ ప్రజాప్రతినిధులు

అఖిల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:26

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి),,/   ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని, ఆలుబాక రైతువేదిక భవనంలో మీకోసం మేమున్నాం సహాయక కమిటీ ఆధ్వర్యంలో, అఖిల హాస్పిటల్ - చర్ల వారిచే ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు.ఈ వైద్య శిబిరాన్ని ఆలుబాక సర్పంచ్ ఆదిలక్ష్మి, చర్ల రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడుగంపా రాంబాబు లచే ప్రారంభించారు. 

బీజేపీలో పలువురి చేరికలు

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:26

వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 16( ప్రజా జ్యోతి)// ములుగు జిల్లా ,వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఇరవై కుటుంబాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు బిజెపిలో చేరడం జరిగింది.వారికి బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సతిష్ కుమార్ ఎంపిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మైనర్ బాలిక మృతి

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:05

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి) . ములుగు జిల్లా,వెంకటాపురం మండలం లోని మంగువాయి గ్రామానికి చెందిన తాటి రత్న కుమారి అనే మైనర్ బాలిక  అనుమానాస్పద స్థితిలో మృతిబాలిక మృతికి బొగ్గుల శివాజీ అనే యువకుడి పై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

హోప్ చైల్డ్ కేర్ సెంటర్ లోని విద్యార్థులకు నిత్యావసర సరుకులు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ

Submitted by sridhar on Tue, 13/09/2022 - 19:55

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) ; వెంకటాపురం మండలం లోని ముక్కునూరుపాలెం గ్రామంలో ని  హెచ్ సిఎస్ చైల్డ్ కేర్ సెంటర్ లోని 75 మంది నిరుపేద విద్యార్థినీ విద్యార్థులకు బియ్యం, నిత్యావసర సరుకులు  గిఫ్ట్ ప్యాకెట్లును జడ్పీటిసి పాయం రమణ చేతులు మీదుగా పంపిణీ చేశారు.. ఈ సదర్భంగా జడ్పీటిసి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తమ పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని కోరారు. హోప్ చారిటబుల్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇలాంటి కార్యక్రమం లో పాల్గొనడం ఆనందం గా ఉందని తెలిపారు.

అర్హులైన పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళు లు ఇవ్వాలి

Submitted by sridhar on Tue, 13/09/2022 - 11:59


వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 12 ( ప్రజా జ్యోతి) మండల కేంద్రంలో వెంకటాపురం మండల కమిటీ ఆధ్వర్యంలోసిపిఎం పార్టీ కార్యాలయం లో మండల కమిటీ సమావేశం గ్యానంవాసు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి  పార్టీ రాష్ట్ర కంట్రోలర్ కమీషన్ చైర్మన్ భద్రాచలం మాజీ ఎంపీ  మిడియంబాబురావు హాజరయ్యారు.ఈసందర్భంగావారు మాట్లాడుతూ  మండలంలో గోదావరి ముంపు బాధితులకు ఇంత వరకు సరిగా నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. అంతేకాకుండా సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇచ్చే దళితులకు దళితభందు సక్రమంగా దళితులకు ఇవ్వాలని అన్నారు,