జనగావ్

ప్రజా సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:18

జనగాం సెప్టెంబర్ 19. ప్రజాజ్యోతి :-   ప్రజా సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు.

17 న జాతీయ జెండాను ఆవిష్కరించ నున్న మంత్రి ఎర్రబెల్లి

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:15

జనగామ, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి :-  రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా  నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఈ నెల 17 న జాతీయ జెండాను  రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, త్రాగునీటి సరఫరా శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ఈనెల  17న ఉదయం 9.00 గంటలకు  కలెక్టర్ కార్యాలయం లో జాతీయ జెండాను  ఆవిష్కరిస్తారని  జిల్లా కలెక్టర్ సి.హెచ్ . శివ లింగయ్య  గురువారం ఒక ప్రకటనలో  తెలిపారు.

ఆదివాసి గిరిజన సమ్మేళనం పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:09

జనగామ, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి :-  జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి చేతుల మీదుగా హైదరాబాద్ లో  ప్రారంభించనున్న ఆదివాసి భవన్, బంజారా భవన్ కు సంబంధించిన వాల్ పోస్టర్, స్టిక్కర్స్ ను గురువారం జనగామ జిల్లా కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య తన చాంబర్ లో డి.సి.పి.

నేషనల్ కాన్ఫరెన్స్ కు ఎంపికైన సర్పంచ్ ప్రత్యూష రెడ్డి

Submitted by bosusambashivaraju on Thu, 15/09/2022 - 12:33

చిల్పూర్  సెప్టెంబర్ 14, ప్రజా జ్యోతి: ఈనెల 15,16వ తేదీలలో ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరగనున్న నేషనల్ కాన్ఫరెన్స్ స్మార్ట్ గ్రామపంచాయతీలు, గ్రామీణ వర్గాల సాధికారత అనే అంశంపై జరగనున్న జాతీయ సదస్సుకు జనగాం జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతి పల్లి గ్రామ సర్పంచ్ కేశిరెడ్డి ప్రత్యూష మనోజ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రత్యూష రెడ్డి మాట్లాడుతూ శ్రీపతి పల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

గిరిజన భవన్ ప్రారంభోత్సవానికి తరలి రావాలి: గణేష్

Submitted by bosusambashivaraju on Thu, 15/09/2022 - 12:20

దేవరుప్పుల సెప్టెంబర్ 14, ప్రజజ్యోతి:జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పడమటి తండా (డి) గ్రామంలో బుధవారం రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకుటిఆర్ఎస్ మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షడు ధరావత్ గణేష్ నాయక్ ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాన గిరిజన ఆదివాసీల ఆత్మ గౌరవం పెరిగేలా ముఖ్య మంత్రి గిరిజన భవనం నిర్మించారు అని అన్నారు. బజారా ప్రజల తరుపున వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అన్ని కులస్తుల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నాడు అని తెలిపారు.

తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల సమీక్ష సమావేశం

Submitted by sridhar on Tue, 13/09/2022 - 19:43

బచ్చన్నపేట సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి:తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సమీక్షా సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ భావాండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వజ్రోత్సవాల స్పెషల్ ఆఫీసర్ విజయకుమార్ మాట్లాడుతూ. ఈనెల 16న నియోజకవర్గస్థాయి లో జాతీయ సమైక్యత ర్యాలీ ఉంటుందని.

సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలి

Submitted by bosusambashivaraju on Tue, 13/09/2022 - 19:41

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్,13 (ప్రజాజ్యోతి ) :- స్టేషన్ ఘన్పూర్ లోని సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పస్తం పృథ్వి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు మంగళవారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు వెళితే విద్యార్థి సంఘం నాయకులకు ప్రవేశం లేదంటూ పాఠశాల అధ్యాపకులు నిలువరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కారం

Submitted by sridhar on Mon, 12/09/2022 - 16:02
  • జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

జనగామ , సెప్టెంబర్ 12, ప్రజాజ్యోతి :- ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు.సోమవారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి పలు విజ్ఞప్తులు స్వీకరించారు.స్టేషన్గన్పూర్ మండలం రాఘవాపూర్ కు చెందిన గౌడ కులస్తులకు కోటి వరాల పథకం కింద 15 మందికి నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందని, కబ్జాదారులు ఆక్రమించి విక్రయిస్తున్నందున అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎల్ల స్వామి, మల్లేష్, వెంకటస్వామి తదితరు