జోగులాంబ గద్వాల్

రోడ్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే అబ్రహం

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:09

అలంపూర్: సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి) ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద నంది గోశాల దగ్గరా జరగిన రోడ్ ప్రమాదంలో మరణించిన ఐజ మండలం గుడిదొడ్డి మహేశ్వర్ రెడ్డీ మరియు ఐజ మున్సిపలటీ టీచర్స్ కాలనీ కి చెందిన చంద్రకళ  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ శాసన సభ్యులు  అబ్రహం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పటల్ నందు వారి మృతదేహాలను త్వరగా పోస్టుమార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అందచేయాలని అక్కడి వైద్యులను మరియు పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది  ఎమ్మెల్యే   వెంట మాజీ సింగల్ విండో ఛైర్మెన్ రాముడు సర్పంచ్ హనుమంత్ రెడ్డీ  రవి  మరియు తదితరులు ఉన్న

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం -- ఎమ్మెల్యే

Submitted by sridhar on Sat, 10/09/2022 - 16:54

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 10 :ఘనంగా స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం వజ్రోత్సవాల వేడుకలుశనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎం ఏ ఎల్ డి డిగ్రీ  కళాశాల లో ఆడిటోరియం భవనంలో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం సంఘం 75 వసంతాల వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు.  ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  హాజరయ్యారు. 

అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:47


అలంపూర్: సెప్టెంబర్ 10(ప్రజా జ్యోతి) అలంపూర్ చోవరస్త ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  వివిధ మండలాల పరిధిలోని గ్రామాల కు చెందిన 32  మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ.7,29,500/- లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేయడం జరిగినది

చాకలి ఐలమ్మ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:31

గద్వాల ప్రతినిది(ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 10 : శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి చిత్రపటానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి పూలమాల వేసి  నివాళులర్పించడం జరిగినది.
తెలంగాణ మహిళల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు అని కొనియాడారు.చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.

కన్నుల పండుగగా శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:23

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 10 :మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవముగా జరిగింది. రాజోలి మండలం మాన్దొడ్డి గ్రామానికి చెందిన రామ్మోహన్ రెడ్డి దంపతులు, కర్నూలుకు చెందిన సృజన జయచంద్ర దంపతులు, గద్వాలకు చెందిన విజయలక్ష్మి కృష్ణ దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం వేదమంత్రోచ్ఛారణల మధ్య వేద పండితులు రమేష్ ఆచారి, మధుసూదనాచారి, రవి, దీరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.

శివాలయానికి నాగపడగ, పాణి వాటం వితరణ

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:19

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 10 : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రం, హరిహరాదులకు నిలయమై క్షేత్రపాలకుడు ఈశ్వరుడు కొలువైన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలోని శివాలయానికి వెండితో తయారు చేసిన నాగపడగ, పాణి వాటం ను బళ్లారికి చెందిన లక్ష్మీదేవమ్మ కుమారులు గుండా చారి, బీమా చారి బహూకరించారు. శనివారం తిమ్మప్ప ఆలయంలో, శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి శివలింగానికి అలంకరించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు ఆధ్వర్యంలో  సన్మానం చేశారు.

డీసీఎంను ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి ఆర్టీసి బస్సును ఢీకొట్టిన టూ వీలర్ ఇద్దరూ మృతి ఒకరికి తీవ్రగాయాలు

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:07

 అలంపూర్: సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి)  ఇటిక్యాల: డీసిఎం వాహనాన్ని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయిన ద్విచక్రవాహనం ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది  ఈ ప్ర‌మాదంలో ఇద్దరూ మృతి చెందగా  మరొక్కరికి గాయాలయ్యాయి  ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి ఇటిక్యాల ఎస్ఐ గోకారి స్థానికులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

జూరాలకు మళ్లీ పోటెత్తిన వరద

Submitted by Thirumal on Thu, 08/09/2022 - 09:20
  • 41 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
  • నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గద్వాల: ప్రజా జ్యోతి ప్రతినిధి:- జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పునఃప్రారంభమైనట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుండి జూరాల ఎగువన ఉన్న కర్ణాటక లోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి దిగువనకు నీటిని వదలడంతో జూరాలకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. దీనికి తోడు దీనికి తోడు కర్ణాటక పరిసరాలు ప్రాంతాలలో కృష్ణానదీ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వర్షపు నీరు నదిలో కలుస్తోంది.

గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని సూచించిన జిల్లా కలెక్టర్

Submitted by Thirumal on Wed, 07/09/2022 - 16:44

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-   బుధవారం మల్దకల్ మండలం అమరవాయి, పాలవాయి గ్రామాలలో  అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేందుకు పోషణ మాసం ప్రభుత్వం నిర్వహిస్తున్నదని అన్నారు.  అమరవాయి గ్రామంలోని మూడవ అంగన్వాడి కేంద్రం పోషణ అభియాన్ కార్యక్రమంలో  పాల్గొన్నారు,