నేరేడుచర్ల

ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబ సభ్యులకు బీమా చెక్కు లను అందజేసిన: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Submitted by Paramesh on Thu, 29/09/2022 - 16:30

నేరేడుచర్ల, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి):   నేరేడుచర్ల మండల పరిధిలోని దిర్శించర్ల గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త పార్టీలో కార్యకర్త గా ఉంటూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన గుండెబోయిన సతీష్  కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురువారం రెండు లక్షల రూపాయల విలువ గల చెక్కును అందజేశారు.ఈ సందర్బంగా సైదిరెడ్డీ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త ఇంటికి కేసీఆర్ పెద్ద దిక్కులా ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ కి కార్యకర్తలే పునాది అని కార్యకర్తల కొసం టీఆర్ఎస్ పార్టీ 18 కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ గా చెల్లిస్తుందన్నారు.

సిపిఐ జాతీయ మహాసభను జయప్రదం చేయండి:సిపిఐ పిలుపు

Submitted by Paramesh on Thu, 29/09/2022 - 13:59

నేరేడుచర్ల, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి):  అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు.గురువారం నేరేడుచర్లసిపిఐ కార్యాలయం ప్రజా భవన్ లో పార్టీ 24 జాతీయ మహాసభల వాల్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూభారత రాజకీయ చిత్రపటంలో అత్యంత పోరాట చరిత్ర కలిగిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని, అధికారంతో సంబంధం లేకుండా ఓట్లు సీట్లతో పట్టింపు లేకుండా నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలో ని

దిర్శించర్ల గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న.... జెట్పిటిసి, వైస్ ఎంపీపీ

Submitted by Paramesh on Thu, 29/09/2022 - 11:51

నేరేడుచర్ల, సెప్టెంబర్28(ప్రజాజ్యోతి):  నేరేడుచర్ల మండలం దర్శించర్ల గ్రామపంచాయతీలో బుదవారం  హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల జడ్పిటిసి రాపోలు నరసయ్య  మండల వైస్ ఎంపీపీతాళ్లూరి లక్ష్మీనారాయణ పాల్గోని చీరలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ మాగంటి మాధవి సైదులు ఎంపీటీసీ డివిజన్ డీలర్ల అధ్యక్షుడు కర్ణం పాండయ్య గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు కొర్రపిడత సైదులు మిడతపల్లి సైదులు గ్రామ వార్డు మెంబర్ అంజి గ్రామ టిఆర్ఎస్ ముఖ్య నాయకులు గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు

తెలంగాణ రైతు సంఘం మండల మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన:సిఐటియు

Submitted by Paramesh on Wed, 28/09/2022 - 09:33

నేరేడుచర్ల, సెప్టెంబర్27(ప్రజాజ్యోతి):  తెలంగాణ రైతు సంఘం మండల మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు పారేపల్లి శేఖర్ రావు కోరారు.నేరేడుచర్ల మండల స్థానిక  అరిబండి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం మండల మహాసభ అక్టోబర్ 1న శనివారం నాడు ఉదయం 10 గంటలకు నేరేడుచర్ల లోని విశ్వబ్రాహ్మణ సంఘం భవన్లో జరుగు మహాసభ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చించనునట్లు ఆయన తెలిపారు.

ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Submitted by Paramesh on Wed, 28/09/2022 - 09:27

నేరేడుచర్ల, సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి):  నేరేడు చేర్ల  మున్సిపాల్టీ ప్రధాన చౌరస్తానందు మంగళవారం  మండలం పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిల్లలమర్రి పుల్లారావు ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వామపక్ష పార్టీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి:సిపిఐ డిమాండ్

Submitted by Paramesh on Mon, 26/09/2022 - 13:01

నేరేడుచర్ల, సెప్టెంబర్25,(ప్రజాజ్యోతి):  వామపక్ష పార్టీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆదివారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.కమ్యూనిస్టులు డబ్బులకు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించడం రేవంత్ రెడ్డి అహంకారపూరితమైన వ్యాఖ్యలకు మొత్తం కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని, డబ్బులకు అమ్ముడుపోయే చరిత్ర రేవంత్ రెడ్డి దేనని ఓటుకు నోటు కేసులో జైల్లో చిప్పకూడు తిన్నది ఎవరో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని, దుబ్బాక హుజురాబాద్ ఉప

సహకార సంఘము ద్వారా అర్హులైన రైతులకు ఋణములు అందిస్తాం......సహకార బ్యాంక్ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి

Submitted by Paramesh on Sat, 24/09/2022 - 11:15

నేరేడు చర్ల, సెప్టెంబర్ 23, (ప్రజా జ్యోతి):  నేరేడు చర్ల పట్టణ పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నేరేడుచర్ల, నందు శుక్రవారము మహాజన సభ సమావేశము సంఘ అధ్యక్ష్లులు మరియు నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ సందర్బముగా అధ్యక్షుల అప్పిరెడ్డి మాట్లాడుతూ సంఘము ద్వారా అర్హులైన రైతులకు సల్పకాలిక ఋణములు మరియు దీర్ఘ కాళిక ఋణములు, సంఘము ద్వారా రైతులకు అందుబాటులో వుండే విధముగా పురుగు మందుల వ్యాపారము ప్రారంబించినాము అని అన్నారు.

పత్తే పురం గ్రామంలో బి యస్పి గ్రామ కమిటీ ఎంపిక

Submitted by Paramesh on Sat, 24/09/2022 - 10:47

 గ్రామ అధ్యక్షులు గా వట్టేపు జీవన్ ప్రధాన కార్యదర్శి మెక్కొండ మహేష్