అలంపుర్

ఎమ్మెల్యే అబ్రహం ని మర్యాద పూర్వకంగా కలిసిన: ఐజ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 13:17

అలంపూర్,(ప్రజా జ్యోతి) సెప్టెంబర్29:  ఐజ మండలం,అలంపూర్ మార్కెట్ యార్డ్  నూతన చైర్ పర్సన్ గా, కీర్తిశేషులు ఉత్తనూర్ తిరుమల్ రెడ్డి సతీమణి సువర్ణమ్మ ని, మరియు వైస్ చైర్మన్ గా రఘునందన్ రెడ్డీ ని నియమించినందుకు అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  అలంపూర్ శాసన సభ్యుడు డాక్టర్ వియం.అబ్రహం ని, తిరుమల్ రెడ్డీ కుమారుడు గౌతమ్ రెడ్డీ, ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని,  మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి మిఠాయి తినిపించి ఎమ్మెల్యే కి ధన్యవాదములు తెలిపిన ఐజ మండల మరియు మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు.

అనారోగ్యంతో బాధపడుతున్న వారినీపరామర్శించిన ఎమ్మెల్యే అబ్రహం

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 13:04

  అలంపూర్,(ప్రజాజ్యోతి)సెప్టెంబర్29: ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కే పౌల్,కొద్ది రోజుల క్రితం కరెంట్ షాక్ కు గురికావడం తో,చికిత్స నిమిత్తం కర్నూల్ లోని, మెడి కవర్ హాస్పటల్ లో,చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యుడు డాక్టర్ వియం.అబ్రహం,  హాస్పటల్ కు వెళ్లి వారిని పరామర్శించి అక్కడున వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు, అనంతరం సీఎం సహాయ నీది ద్వార సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు,ఎమ్మెల్యే  వెంట కొత్తపల్లి సర్పంచ్ గోపాల కృష్ణ, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు ఉన్నారు.

సాతార్ల గ్రామానికి బ్రిడ్జి లేక అవస్థలు పడుతున్న ప్రజలు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 13:02

అల్లంపూర్,(ప్రజాజ్యోతి ) సెప్టెంబర్ 29:   ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు ఏకమై పొంగి పొర్లుతున్నాయి అలాగే గ్రామానికి సమీపంలో ఉన్నా పెద్ద వాగు భయంకరమైన రీతిలో పొంగి పొర్లు తునందున సాతర్ల గ్రామ ప్రజలకు వైద్యం కోసం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి  వెళ్లాలన్న ఇటిక్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలన్న పెద్దవాగు దాటలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి,  వ్యవసాయ పనులకు వెళ్ళాలి అనుకున్నా వాగుదాటి పోవాల్సిందే సాతర్ల గ్రామా ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్న వించిన నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్పా గ్రామ ప్రజలకు న్యాయం చెయ్యడం లేద

స్వరాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత -ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుంది

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 12:59

 అలంపూర్(ప్రజాజ్యోతి ) సెప్టెంబర్29: గొంద్దిమల్ల గ్రామం  లో, కృష్ణ నదిలో ఒక లక్ష  ఉచిత చేప పిల్లలను వదిలిన అలంపూర్ శాసన సభ్యుడు డాక్టర్ వియం.అబ్రహంఅంతకు ముందు గొంద్దిమల్ల గ్రామంలో శ్రీ.శ్రీ.

ఒక లక్ష యాభై వేలరూపాయల ఎల్ఓసిని అందజేసిన: ఎమ్మెల్యే అబ్రహం

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 12:58

 అలంపూర్, (ప్రజాజ్యోతి)సెప్టెంబర్29:  చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, ఇటిక్యాల మండలం గోపాల్ దీన్నే గ్రామానికిచెంద్దిన,దేవరాజు అనారోగ్యంతో బాధపడుతున్న  ఆయనకి  వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా 1,50,000/- రూపాయల  ఎల్ఓసి ని అలంపూర్ శాసనసభ్యుడు డాక్టర్ వియం.అబ్రహం  అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆర్డీఎస్ చైర్మెన్ సీతారాం రెడ్డీ,గోపాల్ దీన్నే రవి, జీవరత్నం,పరుష రాముడు,మరియు తదితరులు పాల్గొన్నారు.

అంధకారంలో17వ వార్డు

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:27

ఆరు రోజులు కావస్తున్న వెలగని వీధిలైట్లు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్

అలంపూర్,సెప్టెంబర్28 :(ప్రజాజ్యోతి): ఐజమున్సిపాలిటీలోని 17వ వార్డు, పాత హెచ్ పి గ్యాస్ ఆఫీస్ సమీపంలో సిసి రోడ్డు లైన్ లో ఆరురోజుల నుండి వీధిలైట్లు వెలగడం లేదని స్థానిక ప్రజలు తెలిపారు. వీధి లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని  వాపోయారు. వెంటనే  సంబంధిత మున్సిపాలిటీ అధికారులు, వార్డు కౌన్సిలర్ స్పందించి వీధిలైట్లు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

శాంతినగర్ మున్సిపల్ చైర్ పర్సన్ ని కలిసిన జర్నలిస్టులు

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:25

అలంపూర్,(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 28:   అల్లంపూర్ నియోజకవర్గ పరిధిలోని శాంతినగర్ మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ సూరిని బుధవారం దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించారు. ఆయన వెంట జర్నలిస్టులు మద్దిలేటి , ఆనంద్,  తదితరులు మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసినవారిలో ఉన్నారు.

యాపదిన్నె బ్రిడ్జీని వెంటనే నిర్మించాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:21

ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
బీఎస్పీ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఎంసీ కేశవరావు

ఐజ-పులికల్ ప్రధాన రహదారిని పూర్తి చేయాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:17

 అలంపూర్, (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 28 :  ఐజా మండలం, పులికల్  గ్రామంలో ఐజ మండల ఇన్చార్జి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశవ్ రావు  బీఎస్పీ పార్టీని బలోపేతం చేసేందుకు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.  అలాగే గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తీరాలంటే మనం బీఎస్పీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. అలాగే ఆర్ఎస్  ప్రవీణ్ నాయకత్వంలో  బహుజనలకి రాజ్యాధికారం వస్తుందని ఆయన అన్నారు.