అదిలాబాద్

విద్యుత్ బకాయిల పరిశీలన

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:28

లింగాపూర్ సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి) ..// విద్యుత్ సౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఈ శ్రీనివాస్ హెచ్చరించారు. విద్యుత్ ఏడిఈ శ్రీనివాస్ గురువారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ మండలంలోని  చుట్టుపక్కల గ్రామాలలో విద్యుత్ అధికారులు ఇంటింటి కి తిరుగుతూ విద్యుత్ స్తంభాలను, అక్రమ కనెక్షన్లు, బకాయి బిల్లులను పరిశీ లించారని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు  వంద యూనిట్ ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా ఉంటుందని, దానిలో భాగంగా మీటరు లేని ఎస్సీ, ఎస్టీ ప్రజలకు బకాయిలు ఉన్న  వారికి వారి విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరిగిందని తెలిపారు.

టి యు డబ్ల్యూ జే జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేయండి.

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:14

 లింగాపూర్  సెప్టెంబర్ 22, (ప్రజాజ్యోతి)  ..//  ఈ నెల  28న ఎస్ ఎం గార్డెన్స్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో   టీయూడబ్ల్యూజే   ద్వితీయ మహాసభలు జరుగుతాయని, వీటిని  జయప్రదం చేయాలని  టి డబ్ల్యూ జే జిల్లా కార్యవర్గ సభ్యులు చవాన్ రామేశ్వర్ కోరారు. గురువారం  మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి  యు డబ్ల్యూ జే)  జిల్లా ద్వితీయ మహాసభలకు  జర్నలిస్టులు భారీ సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కెసిఆర్ అబద్దాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:11
  • తెలంగాణలో ప్రజలు సంవత్సరానికి 42 వేలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు
  • టిఆర్ఎస్ ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో కేవలం 25 వేలు ఇస్తుంది
  • ఈ లెక్క తప్పైతే నేలకు ముక్కు రాస్తా
  • ప్రజా వ్యతిరేక నరహంతక తెరాస ప్రభుత్వానికి చరమగీతం పాడాలి
  • టిఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి),,..// హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తనదైన రీతిలో విరుచుకుపడ్డారు.

సినీ రంగంలో ఆదిలాబాద్ ఆదివాసి గిరిజన కళాకారులకు అవకాశం

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:08

ప్రముఖ సిటీ డైరెక్టర్ ఫయిం సర్కార్

ఫయిం సర్కార్ ను ఘనంగా సన్మానించిన గిరిజన కళాకారు

ఎమ్మెల్యే ను పరామర్శించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Submitted by Degala shankar on Thu, 22/09/2022 - 16:48

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి),,,..  ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ను ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న గంప గోవర్ధన్ గురువారం ఎమ్మెల్యే స్వగ్రామమైన జైనథ్ మండలం దీపాయి గూడ గ్రామానికి వచ్చి భోజమ్మ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రామన్న తో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు

Submitted by BikshaReddy on Sun, 18/09/2022 - 17:01

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరచుకొని,ఉగ్రవాద కార్యకలాపాల పై శిక్షణ ఇస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎన్ఐఎ అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మదీనా కాలనీలో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఎ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మహమ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ మొబిన్,అనే ఇద్దరినీ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

Tags