Mulugu district

గాంధీ ఆశయాలను ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి : డిఆర్ఓ రమాదేవి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:37

ములుగు జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి):  జాతీపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ములుగు డిఆర్ఓ రమాదేవి అన్నారు.ఆదివారం మాహత్మాగాంధీ జయంతి సందర్భంగా ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రమాదేవి మాట్లాడుతూ సత్యాగ్రహం అయుధంగా అహింస,శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్య్ర సముపార్జన చేసిన మహానీయుడు మహాత్మగాంధీ అని కొనియాడారు.గాంధీ చూపిన మార్గంలో పయణించి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని అన్నారు.కార్యక్రమంలో కలెక్టరేట్,ఆర్డీఓకార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రామప్పలో చేనేత వస్త్ర ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:19

వెంకటాపూర్/ములుగు జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయ గార్డెన్లో గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.సేవ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్,జగదీష్,ప్రశాంత్ ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పురావస్తు శాఖ డిఈ చంద్రకాంత్, తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ డివిజనల్ మేనేజర్ కృష్ణ హరి,పిఎంఈజిపి రాజేష్ నోడ

సోదర భావాన్ని చాటుదాం : సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:01

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): ప్రతి ఒక్కరు స్నేవాతత్వాన్ని అలవర్చుకుని,సోదర భావాన్ని చాటాలని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.ములుగు జిల్లా కేంద్రంలోని రామాలయం వద్ధ ఏర్పాటు చేసిన దుర్గామాత సన్నిధిలో శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహా అన్నదాన కార్యక్రమం చేసి భక్తులు తస్లీమా అన్నం వడ్డించారు.దుర్గామాత సన్నిధిలో ప్రత్యేకంగా నిర్వహించిన పూజలో తస్లీమా పాల్గొన్నారు.దుర్గామాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలు నవరాత్రులు పూజిస్తారని, దేవిమాత సన్నిధిలో ప్రతి ఒక్కరు పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తస్లీమా ఆకాంక్షించారు.పండుగ ర

అనుబంధ రంగాలకు బ్యాంకర్లు రుణాలు సకాలంలో ఇవ్వాలి : అదనపు కలెక్టర్

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:56

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): ములుగు జిల్లాలో చేపడుతున్న సంక్షేమ శాఖల పథకాలు, వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ అర్హులైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ వైవి.గణేష్ బ్యాంకు అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశం నిర్వహించి, 2022-23 వార్షిక లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై జిల్లా అదనపు కలెక్టర్ బ్యాంకర్ లతో సమీక్షించారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Submitted by srinivas on Thu, 29/09/2022 - 10:48

గణపురం,సెప్టెంబర్28 ప్రజాజ్యోతి :  మండలంలోని  బుద్దారం గ్రామానికి చెందిన పోలు సారంగం ముదిరాజ్ ఇటీవల మృతి చెందాగా అతని కుటుంబ సభ్యులను ముదిరాజ్ మహాసభ నాయకుడు బోయిని సాంబయ్య ముదిరాజ్  పరామర్శించి 50 కేజీల బియ్యం తో పాటు ఆర్ధిక సహాయం అందించాడు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ గ్రామకమిటి అధ్యక్షులు మాల రమేష్, కుల పెద్దమనిషి మాలవేణి సారంగం లు పాల్గొన్నారు.

ఇసుక రీచ్ ల వద్ద వే బిల్ లోని వివరాల భారీ ఫ్లెక్సీలు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి : జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:24

ములుగు జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28(ప్రజా జ్యోతి): ఇసుక రీచ్ ల వద్ద వే బిల్ లోని వివరాల భారీ ఫ్లెక్సీలు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.బుధవారం ములుగు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఇసుక స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక లారీల రూట్ మ్యాప్ వివరాలు తెలియపర్చాలన్నారు.ఇసుకలారీలు ఓవర్ లోడ్ వెళ్లకుండా రూల్స్ ప్రకారం వాహనాలను సీజ్ చేయాలన్నారు.ఇసుక లారీలు సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ పూర్తి చేసుకొని 9 గంటల వరకు గమ్యస్థానాలకు వెళ్లేలా చర్యలు తీసుక

ములుగు జిల్లాను పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 09:46

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి): ములుగు జిల్లాను పోషకాహారలోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి సూచించారు.బుధవారం ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటిడిఏ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మహోత్సవం,2022 బతుకమ్మ సంబరాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కృష ఆదిత్య,ఐటిడిఏ పివో అంకిత్ లతో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ మహిళా రక్షణ,శిశు,కిషోర బాలికల, బరువు పెంచడం,పోషణ సంక్షేమం, జిల్లాలో పోషణ అభియాన్ కా

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనం :: కలెక్టర్ క్రిష్ణ అదిత్య

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:23

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): స్వాతంత్ర్య సమర యోధుడు,తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనమని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ అదిత్య పేర్కొన్నారు.‌మంగళవారం ములుగు కలెక్టరేట్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా అయన చిత్రపటానికి  పూల మాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు.