వరంగల్

రౌడీ షీటర్లకు ఎస్సై కౌన్సిలింగ్

Submitted by veerareddy on Wed, 07/09/2022 - 16:03

బచ్చన్నపేట సెప్టెంబర్ 7 ప్రజా జ్యోతి:మండలంలోని పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఉన్నత అధికారుల సూచన మేరకు ఎస్సై నవీన్ కుమార్, సృజన్ కుమార్ ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు పలు సూచనలు చేశారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఎలాంటి తగాదాలకు గొడవలకు తల దూర్చొద్దని, భూతగాదాలు సెటిల్మెంట్ చేయొద్దని, లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకురావద్దని సూచించారు. మంచి క్రమశిక్షణతో కలిగి ఉండాలని భవిష్యత్తులో మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులపై రౌడీ షీటర్లను తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రేస్ సర్వీస్ సొసైటి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు గిఫ్ట్ పాకెట్స్ పంపిణీ

Submitted by veerareddy on Wed, 07/09/2022 - 15:10

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 06 (ప్రజా జ్యోతి) గ్రేస్ సర్వీస్ సొసైటి స్వచ్చంధ సేవా సంస్థ ఖమ్మం వారు, ములుగు జిల్లా వెంకటాపురం  మండలంలోని మంగళవారం రంగరాజాపురం,బి సి మర్రిగుడెం, నెలారుపేట, వి ఆర్ కె పురం , చోక్కాల, పాలెం  రశపల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుచున్నా 550 మంది నిరుపేద విద్యార్థిని విద్యార్ధులకు రెండు లక్షల యాబైవేల రూపాయల విలువ చేసే బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు గిఫ్ట్ పాకెట్స్ లను పంపిణి చేశారు.

ప్రశాంత వాతావరణలో నిమజ్జనం జరుపుకోవాలి సీఐ రాజిరెడ్డి

Submitted by veerareddy on Wed, 07/09/2022 - 15:01

భూపాలపల్లి సెప్టెంబర్6 ప్రజాజ్యోతి.  ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వినాయక మండపాల కమిటీ సభ్యులతో స్థానిక పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా సీఐ రాజిరెడ్డి వినాయక మండపాల కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని, మధ్యం సేవించి వాహనాలు నడపటం, గొడవలకు దిగడంలాంటివి చేయకూడదన్నారు. ఊరేగింపులో డీజేలు ఉపయోగించవద్దని, నిర్నీత సమయంలో నిమజ్జన ప్రాంతాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

విష జ్వరాలు, సంక్షేమ పథకాల పై అవగాహన కార్యక్రమం

Submitted by veerareddy on Wed, 07/09/2022 - 14:54

మల్హర్:వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ప్రభుత్వం పేదలకు అందిస్తున్న  సంక్షేమ పథకాల పై జిల్లా కలెక్టర్ , డిపిఆర్వో ఆదేశాల మేరకు జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కుంభంపల్లి, వల్లెంకుంట  తో సహా పలు గ్రామాల్లో కళాకారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కళాకారులు పాటల ద్వారా విష జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాటల రూపంలో ప్రజలకు వివరించారు.అనంతరం బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్థాలు గురించి , చెట్లు పెంచడం వల్ల కలిగే లాభాలను వివరించారు.