Nidamanur

కొనసాగుతున్న కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు

Submitted by venkat reddy on Wed, 28/09/2022 - 08:32

నిడమనూరు, సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి)ః  నిడమనూరు మండలకేంద్రంలో  కనకదుర్గదేవి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. కనకదుర్గ శరనవరాత్రి  ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కనక దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలు  జరుగుతున్నాయి.ఈసందర్భంగా మంగళవారం నిడమనూరు కనకదుర్గమ్మ అమ్మవారుగాయత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కనకదుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు జమలుపూరి నర్సింగ్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు.

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ధర్నాః

Submitted by venkat reddy on Tue, 27/09/2022 - 16:00

 నిడమనూరు, సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి):   వ్యవసాయానికి 24 గంటల ఉచిత  విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తు సోమవారం నిడమనూరు విద్యుత్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పడం తప్ప ఎక్కడ ఇచ్చింది లేదన్నారు. ఎన్నెస్పి ఎడమ కాలువకు గండి పడి ఓ పక్క రైతులు తీవ్రంగా నష్ట పోతే, మరోపక్క విద్యుత్ సరఫరా చేయకపోవడంతో  అందక బోర్ల కింద పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరచూ విద్యుత్ కోతల వల్ల మోటార్లు కాలిపోతున్నాయి.

ఘనంగా కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు

Submitted by venkat reddy on Tue, 27/09/2022 - 15:44

నిడమనూరు, సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి)ః  నిడమనూరు మండలకేంద్రంలోని  కనక దుర్గదేవి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. సోమవారం కనకదుర్గ శర నవరాత్రి  ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  కనక దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలు  ప్రారంభించారు.ఈసందర్భంగా నిడమనూరు కనకదుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు జమలుపూరి నర్సింగ్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని  ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు.

కనకదుర్గ ఆలయాల్లోఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

Submitted by venkat reddy on Tue, 27/09/2022 - 15:23

ఫోటో రైటప్ ః రాజన్నగూడెంలో కనకదుర్గమ్మ అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు

శేషరాజు బిక్షమయ్య ను పరామర్శించిన మాజీ సీఎల్పీ నేత

Submitted by venkat reddy on Mon, 26/09/2022 - 13:21

నిడమనూరు, సెప్టెంబర్ 25(ప్రజాజ్యోతి):  నిడమనూరు గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ బిసి రాష్ట్ర నాయకులు శేషరాజు  బిక్షమయ్యకు ఇటీవల ప్రమాదవశాత్తు కాలువిరగడంతో చికిత్స నిమిత్తం నల్గొండ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం తెలుసుకొని ఆదివారం  మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి నిమ్స్ హాస్పటిల్ లో చికిత్స పొందుతున్న శేషరాజు  బిక్షమయ్యను పరామర్శించారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగసాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిడమనూరు మండల అధ్యక్షుడు అంకతి సత్యం, నిడమనూరు సర్పంచ

ముస్తాబైన కనకదుర్గ ఆలయాలు.. -రేపటి నుంచే నవరాత్రి ఉత్సవాలు

Submitted by venkat reddy on Sun, 25/09/2022 - 13:08

నిడమనూరు, సెప్టెంబర్24(ప్రజాజ్యోతి):  తెలంగాణ రాష్ట్రంలో కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాలు ప్రత్యేకమైనవి.కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పూజలందుకునే జగన్మాత, నవరాత్రుల్లో వివిధ రూపాల్లో దర్శనమివ్వనుంది.దసరా మహోత్సవాలకు రాజన్నగూడెంలోని కనకదుర్గమ్మ ఆలయం మహ అద్బుతంగా ముస్తాబైంది. భాద్రపద మాసం తొలి దుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్నగూడెం కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్‌ 26 నుంచి 04 వరకు నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

తొమ్మిది రోజులు.. తొమ్మిది తీర్లు..

Submitted by venkat reddy on Sun, 25/09/2022 - 11:56

-ఇదే బతుకమ్మ సాగే విధానం
-నేడు ఎంగిలిపూల బతుకమ్మ
ఫోటోరైటప్ ఃబతుకమ్మ ఫోటో 
నిడమనూరు, సెప్టెంబర్ 24(ప్రజాజ్యోతి): 
తెలంగాణలో బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులు వైభవంగా జరుగుతాయి. అలాగని తొమ్మిది రోజులూ ఒకేలా జరగవు. తొమ్మిది రోజులూ తొమ్మిది తీర్లుగా బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. బతుకమ్మ వేడుకల్లో ఏరోజుకారోజే ప్రత్యేకం. రోజుకో విశిష్టత ఉంటుంది.

వేంపాడు లో ఉచిత వైద్య పరీక్షలుః

Submitted by venkat reddy on Sun, 25/09/2022 - 11:52

నిడమనూరు,సెప్టెంబర్24(ప్రజాజ్యోతి): నిడమనూరు మండలంలోని వేంపాడులో సువర్ణ మల్టీస్పెషల్టి హాస్పిటల్  మిర్యాలగూడ ఆద్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు శనివారం వేంపాడు సర్పంచ్ అర్వ స్వాతి అశోక్ యాదవ్ తెలిపారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో మహిళలకు గౌరవం

Submitted by venkat reddy on Sun, 25/09/2022 - 11:49

నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ 
-బతుకమ్మ కానుక చరిత్రాత్మకం
-ప్రకృతి ని ఆరాధించే పండుగ బతుకమ్మః
-గంగా జమున తహజీబ్ కు బతుకమ్మ పండుగ ప్రతిబింభం
-ప్రజలను ప్రేమించే కేసీఆర్ వల్లే  ఇలాంటి పథకాలు సాధ్యం