డ్రగ్స్ సేవించడం చట్ట వ్యతిరేకం ఎస్సై బొడిగె రామకృష్ణ గౌడ్

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 12:38
Taking drugs is against the law Essay Bodige Ramakrishna Goud

నార్కట్ పల్లి; సెప్టెంబర్ 13( ప్రజా జ్యోతి)  హానికరమైన గంజాయి స్టెరాయిడ్ లాంటి ప్రమాదకరమైన డ్రగ్స్ సేవించడం చట్ట వ్యతిరేకమని స్థానిక ఎస్సై బొడిగె రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక కామినేని వైద్య విద్య కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగము, చట్టంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్యసాధన దిశగా కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాలు సేవించడం పట్ల అద్భుత శక్తి వస్తుందని మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు. మాదకద్రవ్యాలు సేవించడం క్రయ విక్రయాలు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవడంతోపాటు తల్లిదండ్రుల ఆశలు అడియాస లు అవుతాయని చెప్పారు. విద్యార్థులు వైద్యరంగంలో మెరుగైన వైద్యం అందించేందుకు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కళాశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఆంటీ డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ  కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.