శిక్షణ అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:51
 Take advantage of training awareness programs  District Collector Sikthapatnaik

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి)..//..శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శనివారం స్థానిక టిటిడిసి సమావేశ మందిరంలో రెవెన్యూ, పంచాయతీ, అటవీశాఖ, అధికారులకు అంతర్గత శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని వృత్తిరీత్యా విధులు నిర్వహించాలని, ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అవగాహనతో పాటు ప్రయోగాత్మకంగా శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ, పంచాయతీ, అటవీ శాఖల అధికారులకు కల్పించిన శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని, భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టి కార్యక్రమాలను సమన్వయంతో విధులు నిర్వహించాలని అన్నారు. స్థానిక సంస్థల అదునపు కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష మాట్లాడుతూ శాఖల సమన్వయంతో పనులు నిర్వహించాలని అన్నారు. అనంతరం ఆయా ఉద్యోగులకు ప్రయోగాత్మక శిక్షణ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ మొబైల్ యాప్ ద్వారా ప్రయోగాత్మకంగా విధులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జెడ్పి సీఈవో గణపతి, తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, పంచాయతీ కార్యదర్శులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.