గాంధీ జయంతి సందర్బంగా స్వచ్ఛభారత్ చేపట్టిన సర్పంచ్

Submitted by bosusambashivaraju on Sun, 02/10/2022 - 15:45
Swachh Bharat was undertaken on the occasion of

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 (ప్రజాజ్యోతి ) : - మండలంలోని చాగల్లు గ్రామంలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టేషన్ ఘనపూర్ సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ పోగుల సారంగపాణి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకను ఘనంగా చేపట్టారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ సత్యం, అహింస అను సిద్ధాంతాలను పాటించి దేశ ప్రజలను కలుపుకొని దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు చేసి ఆంగ్లేయుల నుండి దేశానికి స్వాతంత్య్రం సిద్దింపజేశారు. నాటి నుండి గాంధీని మహాత్మా గా, మన దేశ పితామహుడు గా పిలుచుకుంటున్నామని సర్పంచ్ అన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్ సారంగపాణి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, మహిళల తో కలిసి రోడ్లు ఊడ్చేశారు.