స్వచ్ఛ ఆశ్రమ పాఠశాల కార్యక్రమాలు పూర్తి - డి.డి రమాదేవి

Submitted by kranthikumar.dasari on Sun, 11/09/2022 - 18:11
Swachh Ashram school programs complete - DD Ramadevi

భద్రాచలం, సెప్టెంబర్11 ప్రజాజ్యోతి:- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో మరియు వసతి గృహాలలో ఈనెల 6 నుండి 11వ తేదీ వరకు నిర్వహించిన స్వచ్ఛ ఆశ్రమ పాఠశాల కార్యక్రమాలు ,అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి అన్నారు. ఆదివారం నాడు స్వచ్ఛ ఆశ్రమ కార్యక్రమం ముగింపు సందర్భంగా, భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో, నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థినిలతో ,కలిసి కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు, మరియు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గారి ప్రత్యేక శ్రద్ధ మేరకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమపాఠశాలలో స్వచ్ఛ ఆశ్రమ కార్యక్రమాలు, ఈ నెల 6 నుండి ప్రారంభించామని, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులు ,ఉపాధ్యాయులు, సిబ్బంది, అలాగే గ్రామంలోని ప్రజల సహకారంతో ,ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. ఆరో తారీఖు నాడు పాఠశాలల్లోని పనికిరాని వస్తువులు అన్నియు తీసివేసి, పాఠశాలలోని వరండాలు శుభ్రం చేయించడం జరిగిందని, అలాగే ఏడవ తారీఖు నాడు పాఠశాలల్లోని కంప్యూటర్స్, సైన్స్ ల్యాబ్ , కరెంట్ కి సంబంధించిన ట్యూబ్ లైట్లు ,ఫ్యాన్లు పూర్తిగా మరమ్మత్తులు చేయించడం జరిగిందని, ఎనిమిదవ తారీఖు నాడు తరగతి గదులు, మంచినీటి ట్యాంకులు, కాలువలు మరియు పాఠశాలల ఆవరణలో, నీరు నిలువ లేకుండా చేయడం, అలాగే చెత్తాచెదారాన్ని తొలగించి ,పాఠశాలలోని పరిసరాలు శుభ్రం చేయించడం జరిగిందని, 9వ తారీఖు నాడు వంటగది, భోజనం హాలు, అలాగే డార్మెటరీ రూము ,శుభ్రం చేయడం జరిగిందని, పదవ తారీఖు నాడు పాఠశాలల్లో హరితహారం కింద అందరం కలిసి మొక్కలు నాటి ,వాటి సంరక్షణ చూసుకునేలా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, చివరి రోజు అనగా 11వ తారీఖు నాడు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినిల లో , దాగి ఉన్న కళలకు సంబంధించిన డాన్సులు, నాటికలు, ఏకపాత్రాభినయాలు, సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. భద్రాచలంలోని బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలతో కలిసి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమాలు మునుముందు కూడా చేపట్టాలని విద్యార్థినిలు మూకుమ్మడిగా అనడం చాలా ఆనందం కలిగిందని ,ఈ సందర్భంగా పై అధికారులకు వారంతా పాఠశాలల శుభ్రత పట్ల ,ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నడుస్తున్న అన్ని ఆశ్రమ పాఠశాలల్లో మరియు వసతి గృహాల్లో ఆరో తారీఖు నుండి 11 వ తారీకు వరకు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించామని, అంతట మంచి స్పందన వచ్చిందని, సంబంధిత ఏటి డి వో లు వారి పరిధిలోని పాఠశాలల్లో ప్రత్యేక బాధ్యతతో ఈ యొక్క కార్యక్రమం విజయ వంతం కావడానికి కృషి చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నట్టు ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏ టి డి ఓ నరసింహారావు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ద్వారక ,అనిత, ప్రధానోపాధ్యాయురాలు సావిత్రి, స్వాతి మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.