ఆసరాతో అన్ని వర్గాల ప్రజలకు అండ,

Submitted by md yusuf on Tue, 20/09/2022 - 12:03
Support people from all walks of life,

కాంగ్రెస్,బీజేపీ,పార్టీలవి దగాకోరు రాజకీయాలు,
బీజేపీ అంటే బడా జూటా పార్టీ
మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి,

ఉర్కొండ సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి)../ఆసరా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండ నిలుస్తుందని మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు సోమవారం ఉర్కొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి,మాధారం,ఉర్కొండపేట, ఇప్పపహడ్,గ్రామాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నూతనంగా మంజూరైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీతో పాటు రాచాలపల్లి గ్రామంలో 5లక్షల రూపాయల ఎంపీపీ నిధులతో అండర్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపనలు చేసి మాధారం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతువేదికను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పల్లె,గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సంక్షేమ ఫలాలు పక్కాగా అందుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలు వర్గాల ప్రజలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందని అది చూసి ఓర్వలేక కాంగ్రెస్,బిజెపి పార్టీలు అధికారం కోసం కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయంగా పబ్బం గడుపుతున్నాయని బీజేపీ అంటే బడా జూటా పార్టీ అని మండిపడ్డారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ రాధ జంగయ్య, జడ్పీటిసి శాంతకుమారి రవీందర్,వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యుడు కలీంపాషా రైతుబంధు మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తహశీల్దారు జాకీర్అలీ, ఎంపీడీఓ ప్రభాకర్,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జనార్ధన్ రెడ్డి,గిరినాయక్, మండల అధ్యక్షుడు వీరారెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు విజయమ్మ,సునీత సాంబశివుడు,అనిత నాగోజి, వనజా బాలస్వామి, ఆంజనేయులు,ఎంపిటిసిలు లావణ్య అమ్రేశ్వర్ రెడ్డి,గోపాల్ గుప్తా,ఈశ్వరమ్మ,ఉప సర్పంచ్లు హుస్సేన్,బుచ్చమ్మ పాపయ్య,మాజీ సర్పంచ్లు కృష్ణగౌడ్,శ్రీనివాసులు, నాయకులు సిద్దు, శ్రీనివాసులు,రమేష్,గిరి,బోల్గం మల్లేష్,కృష్ణ,చంద్రకాంత్,శ్రీశైలం,తదితరులు పాల్గొన్నారు.