ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:26
Suicide prevention is a social responsibility

మహబూబాబాద్/ తొర్రూరు సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి)..//.ఆత్మహత్యల నివారణ అందరి సామాజిక బాధ్యత అని ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ , ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ తెలిపారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆరోగ్య మిత్రా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు.పాఠశాల ప్రిన్సిపాల్ జి జయ శ్రీ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో డాక్టర్ అశోక్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరుఆత్మహత్యచేసుకుంటున్నారని తెలిపారు.స్వల్ప ఒత్తిడికి సైతం తట్టుకోలేక ఇటీవలఅనేకమందిఆత్మహత్యలకుపాల్పడుతున్నారని,  ఇలాంటి వారికి ముందస్తుగా కౌన్సిలింగ్ ఇస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.  ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం మానసిక ఒత్తిడి , ఒంటరితనం అయినవారి నుంచి ఆదరణ కరువవడం తదితర కారణాలవల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. ఎవరైనా ఒంటరిగా ఉండటం,  దుఃఖం, నిరాశ, ఆత్మహత్యా సాధనాలను సమకూర్చుకోవడం వంటివి చేస్తుంటే.. వారికి కౌన్సిలింగ్, మెడిటేషన్, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు చూపించేలా చేయాలని తెలిపారు.   విద్యార్థులు మార్కుల కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని,  చదువు కంటే జీవితం పెద్దదని గుర్తు చేశారు.ఈకార్యక్రమంలో  ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మోహన్ వారణాసి, , కళాశాల ఉపాధ్యాయ బృందం షీలా బేగం,ఆసియా తన్వీన్,మమత, మౌనిక,నాగ మోహిని,బేబీ సునీత,రజిత,శోభ లు పాల్గొన్నారు.