ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

Submitted by bheemaraidu on Tue, 13/09/2022 - 20:00
Strict action will be taken if traffic rules are not obeyed: Traffic SI Vijay Bhaskar

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 13: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ వాహనదారులకు హెచ్చరించారు. గద్వాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో మంగళవారం ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహనా కల్పించారు.ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ..ట్రాఫిక్ చలాన్లపై అవగాహనా కల్పించారు.  

వాహన దారులు తమ వాహనంపై ఉన్న చల్లన్లు ఎప్పటికప్పుడు ఆన్లైన్, ఫోన్ పే, గూగుల్ పే,ద్వారా చెల్లించాలని గద్వాల ట్రాఫిక్ విజయ్ భాస్కర్ తెలియజేశారు.గద్వాలలో  పట్టణంలో ఉన్న ఆటోమేటిక్ సీసీ కెమెరాలు సిగ్నల్ సమయం పడవక ముందే  వాహనదారులు సిగ్నల్ జంపింగ్ చేసిన ఆటోమెటిక్ సిసి కెమెరా క్లిక్ చేయబడుతుంది, మరియూ చలానా విదించడం జరుగుతుంది అని తెలియజేసారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే వాహనాలను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేస్తామని, అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారి తల్లిదండ్రుల పై చర్యలు తీసుకుంటామని, వాహనాలకు తనిఖీల్లో వాహనం కు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలిస్తామన్నారు.

ఎలాంటి ధ్రువపత్రాలు లేని వాహనాలను స్టేషన్ కు తరలిస్తమన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతు. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలను అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, త్రిబుల్ రైడింగ్ చేసిన వారుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపే సమయంలో హెల్మెంట్, సిట్ బెల్ట్ ధరించాలని , వాహనాలు రాష్ డ్రైవింగ్ చేయరాదని, పరిమిత వేగంలో వాహనాలను నడపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని ప్రజలకు గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ భాస్కర్ అవగాహన కల్పించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ గమ్యాన్ని సురక్షితంగా చేరాలని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ తెలియజేశారు. ట్రాఫిక్ సిబంది రామ కృష్ణ పాల్గొన్నారు.