అనుమతులు లేని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం.... జిల్లా వైద్యాధికారి కోటా చలం

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 10:41
Strict action will be taken against unlicensed hospitals.... District Medical Officer Kota Chalam

సూర్యా పేట టౌన్ సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి)./...సూర్యాపేట జిల్లాలోని అనుమతులు లేని ఆసుపత్రులు, అర్హత లేని వారు  వైద్యం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్వో డాక్టర్ కోటాచలం హెచ్చరించారు. శుక్రవారం సూర్యాపేటలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక తనిఖీ బృందాలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... జిల్లాలోని   ఆసుపత్రులను తనిఖీ చేయడం కోరకు 8 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని తనిఖీ బృందాలను కోరారు. రోగుల సౌకర్యాల మెరుగుదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తిస్థాయి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ లు డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ నిరంజన్  ,  డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ జయా శ్యాంసుందర్, డెమో అంజయ్య , కిరణ్, భాస్కర్ రాజు, భూతరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.