అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది .నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Submitted by Sathish Kammampati on Fri, 02/09/2022 - 16:07
The state government works for the welfare of all the communities.Nakirekal MLA Chirumurthy Lingaiah

నల్లగొండ సెప్టెంబర్ 02, (ప్రజాజ్యోతి )  వృద్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా అందిస్తూ వారిలోఆత్మసైర్యన్ని నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు  నకిరేకల్ మండలానికి చెందిన1100 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు కాగాశుక్రవారం మండల కేంద్రంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్ కార్డులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వ హాయంలో రూ.200 ఇవ్వడానికే తీవ్ర ఇబ్బంది పడిన ఘటనల నుండి నేడు రూ.3వేల వరకు పెన్షన్ లు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వంకే సాధ్యమైంది అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 57 సంవత్సరాలు నిండిన పేదలందరికీ10 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆసరపింఛన్లుఅందిస్తుందన్నారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కిందన్నారు.డయాలసిస్ రోగులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయం తీసుకోవడం పట్ల స్వాగతిస్తున్నామని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సంక్షేమం అగలేదని స్పష్టం చేశారు.ప్రతిపక్షాలు కేవలం దుష్ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకోవడనికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.