శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి

Submitted by bheemaraidu on Mon, 03/10/2022 - 13:17
Sri Kanyaka Parameshwari Devi appeared in the decoration of Sri Saraswati Devi

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) అక్టోబర్ 02 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు ఆశ్వీజశుద్ధ సప్తమి ఆదివారము (మూలా నక్షత్రం)రోజున సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిని అయిన దుర్గాదేవి తన అంశంలోని నిజరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రం నాడు చేసే సరస్వతి అలంకారం ప్రత్యేకత. తెల్లని పట్టుచీర ధరించి, చేతిలో వీణతో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి జన్మ నక్షత్రం రోజున దర్శించుకుంటే భక్తుల కష్టాలు తీరతాయని కోరిన విద్యలు వస్తాయని నమకం. విద్యను, బుద్ధిని ప్రసాదించే సరస్వతి దేవి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు రమేషాచారి తెలిపారు.ఆదివారం మూలనక్షత్రం సందర్బంగా అమ్మవారికి మండల ఆర్యవైశ్య సంఘ మహిళలు ఒడి బియ్యం పోయడం జరిగింది. మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు, పిల్లలు దర్శించుకున్నారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, అలంకరణ మంగళహారతి, తీర్థ ప్రసాదములు వితరణ, సాయంత్రం కుంకుమార్చనలు, సాంస్కృతి కార్యక్రమాలు జరిగాయని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాదం శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లూరు నాగరాజు, మానసాని నాగరాజు, నరహరి వెంకటేష్, పద్మనాభం, సింగనేడ నరసింహయ్య, నరహరి సూరిబాబు, గంగాధర్, సంతోష్, అశోక్, బాదం రాజు, ప్రదీప్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.