వ్యసనాల నుండి యువత ను రక్షించడానికి క్రీడలు అవసరం

Submitted by srinivas on Tue, 27/09/2022 - 12:09
Sports are essential to protect youth from addictions

పోలీస్ శాఖ అధ్యర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ఎస్ ఐ రాజ్ కుమార్

మహదేవపూర్ సెప్టెంబర్ 26 ప్రజాజ్యోతి //..//  మహాదేవపూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ దోస్తీ మీట్ లో భాగంగా రెండు మండలాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజకుమార్ మాట్లాడుతూ  యువత కోసం పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. అందులో భాగంగా యువత లో మానసిక ఉల్లాసం, ఆనందం కోసం క్రీడలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.  వ్యసనాల బారిన పడుతున్న యువత ను రక్షించడానికి, సన్మార్గంలో పెట్టడానికి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, కొట్టి ఆటలో రాణించినట్లు,ప్రతి ఒక్కరూ జీవిత లక్ష్యాన్ని చేరుకోవచ్చని, అందుకే ఆటల్లో ప్రావీణ్యం సాధించాలని ఎస్ఐ అన్నారు. క్రీడల్లో మహాదేవపూర్ స్ఫూర్తిగా నిలుస్తుందని, ఆటలు, పోటీలు, విజయాలు అంటేనే మహాదేవపూర్ అని, అదే ఒరవడిని కొనసాగించి విజేతలు గా నిలువాలని, ఆటలో గెలుపు ఓటములు సహజమే నని, ఓటమి కూడా గొప్ప గెలుపు కు పునాది లాంటిదని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడాల అరుణ,ఎంపీపీ రాణిబాయ్,పలిమెల ఎస్ఐ,అరుణ్ కుమార్ ,క్రీడాకారులు,కోచ్ లు, ఉపాధ్యాయులు,యువకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.