చిరుధాన్యాల పంటలను పరిశీలించిన ప్రత్యేక బృందం.

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 13:06
A special team examined pulse crops.

అచ్చంపేట సెప్టెంబర్ 29 ప్రజా జ్యోతి.  బల్మూర్ మండలంలోని మైలారం అనంతవరం గ్రామాలలో గురువారం చిరుధాన్యాల పంటలను ప్రత్యేక బృందం పరిశీలించింది ఈ సందర్భంగా సజ్జ రాగి పంటలను ఐఐఎం ఆర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ బృందం సభ్యులు చిరుధాన్య పంటలను పండించే విధానం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా చిరుధాన్యాలపై రైతుల అభిప్రాయాన్ని తెలుసుకొని వీడియో చిత్రీకరణ చేయడం జరిగింది చిరుధాన్య పంటలను ఎంచుకోవడానికి గల కారణాలను వారు పండించే విధానం కలుపు చీడపీడలు నివారణ ఉత్పాదన కొత్త చిరుధాన్య పంటలు చేయాలనుకునే రైతులకు వారికి సలహాలు సూచనలు వచ్చే విధానం గురించి ప్రత్యేక బృందం తెలుసుకున్నారు ప్రస్తుత కాలంలో చిరుధాన్య పంటలు చాలా ప్రాధాన్యత ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా రైతులు చిరుధాన్య పంటలు వేసుకోవాలని ప్రత్యేక బృందం సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏ డి ఏ చంద్రశేఖర్ మండల వ్యవసాయ అధికారి మహేష్ కుమార్ ఏఈఓ పవన్ రైతులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్చిరుధాన్య పంటల రైతులతో మాట్లాడుతున్న బృందం.