గురుకులాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి

Submitted by Mdrafiq on Sat, 03/09/2022 - 15:27
Special attention should be given to sanitation management in Gurukuls
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
  • సెప్టెంబర్ 5  నుంచి 11 వరకు గురుకులాలలో పారిశుధ్య వారోత్సవం
  • స్వచ్చ గురుకుల పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, ప్రతినిధి,( ప్రజాజ్యోతి), సెప్టెంబర్ -03: జిల్లాలో ఉన్న గురుకులాలలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. 

శనివారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఎస్సీ గురుకులాలలో చేపట్టే స్వచ్చ గురుకులపోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 11 వరకు జిల్లాలో ఉన్న 6 ఎస్సీ గురుకుల పాఠశాలలో పకడ్బందీగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణను అమలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా గురుకులాల్లో సెప్టెంబర్ 5న చెత్త తొలగింపు, సెప్టెంబర్ 6న పాఠశాల భవనం, పడక గదులను శుభ్రం చేయడం, సెప్టెంబర్ 7న టాయిలెట్స్ నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, పారిశుధ్య ప్రాముఖ్యతపై విద్యార్థులకు పోటీ నిర్వహించడం జరుగుతుందని, సెప్టెంబర్ 8న పాఠశాల కిచెన్, డైనింగ్ ఏరియా పరిసరాలను పరిశుభ్రం చేస్తామని, సెప్టెంబర్ 9న గురుకుల పరిసరాలలో మొక్కలతో సుందరీకరించడం, సెప్టెంబర్ 10న సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సెప్టెంబర్ 11న వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్ కు వివరించారు. స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాలోని గురుకులాలను పూర్తి స్థాయిలో స్వచ్ఛంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్సీ గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , సూపరింటెండెంట్లు, సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.