బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

Submitted by mallesh on Fri, 30/09/2022 - 11:04
 Singireddy Harivardhan Reddy is the aim of the Congress party to be the welfare of the poor people

చౌటుప్పల్ సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి) .//..సీఎం కేసీఆర్ 8 సంవత్సరాలుగా కాలేశ్వరం ప్రాజెక్ట్ పేరిట దోచుకున్న అవినీతి సొమ్మును త్వరలోనే బయటకు తీస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం దేవలమ్మ నాగారం గ్రామంలో నిర్వహించిన బూత్ కమిటీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల డిజైన్ పేరిట ముఖ్యమంత్రి వేలకోట రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష చెబుతున్నారని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని శివన్న గూడెం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తేనే కెసిఆర్ ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. చౌటుప్పల్ మండలం పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకొని ఒకపక్క రైతాంగం మరోపక్క ప్రజలు అనేక బాధలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు లేరంటకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ బిజెపి పార్టీలు డబ్బులతో రాజకీయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తు పేద మధ్య తరగతి కుటుంబాలను బ్రతకనీయకుండా చేస్తుంటే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, రేట్లు పెంచి ములిగే నక్కపై తాటి పండు పడేలా చేస్తున్నారని మండిపడ్డారు.మును గోడు ఉప ఎన్నికల్లో ప్రజలు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే మునుగోడు ఆడపడుచు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జక్క యాదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్కాపురం నరసింహ, మాజీ ఉపసర్పంచ్ బొమ్మ మైసయ్య, వార్డు సభ్యులు బొమ్మ లింగస్వామి, నాయకులు పన్నాల రాజిరెడ్డి, రాసాల జంగయ్య, వడ్డేపల్లి బుచ్చయ్య, పిన్నిటి జంగారెడ్డి, కానుగు యాదయ్య, పెంబల లింగస్వామి, పులిగిల్ల రాము, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.