మహాత్మా గాంధీ విగ్రహం ముందు వీఆర్ఏల మౌన దీక్ష

Submitted by bheemaraidu on Mon, 03/10/2022 - 13:48
Silent Deeksha of VRAs in front of Mahatma Gandhi statue

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) అక్టోబర్ 02 :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు వీఆర్ఏల రాష్ట్ర వ్యాప్త సమ్మె 70వ, రోజు పేస్కేల్ సాధనకై గద్వాల తహసిల్దార్ ఆవరణలో గ్రామ రెవెన్యూ సహాయకుల 70వ, రోజు నిరసన, గాంధీ జయంతి సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జోగులాంబ గద్వాల జిల్లా జేఏసీ అధ్యక్షులు బి.రాములు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి 2020 సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ, తారీఖున నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వీఆర్వో వ్యవస్థ రద్దు అయినందున వీఆర్ఏలకు అందరికీ పేస్కేలు కల్పించి, అలాగే అర్హత ఉన్న వీఆర్ఏలకు అందరికీ ప్రమోషన్లు కల్పిస్తామని, 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, ప్రకటించి రెండు సంవత్సరములు గడిచిపోయినాయి. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. గత నెల 13వ, తారీకున చలో అసెంబ్లీ కార్యక్రమం చేసి నిరసన తెలుపడం జరిగింది. ఆ సందర్భంగా గౌరవ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చర్చలకు ఆహ్వానించి, 20 తారీకు వరకు మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పడమైనది. మళ్లీ 20 తారీకు నాడు చర్చలు జరిపి మీ సమస్య నాకు తెలుసు కొంత టైం కావాలి సమ్మె విరమించమని కోరినారు. గత నాలుగుసార్లు గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ ఒకసారి గౌరవం మంత్రి చెప్పినారు.

కానీ పే స్కేల్ జీవో ఇవ్వలేదు. వీటన్నిటిని పరిణామాలను పరిశీలన చేసి, రాష్ట్ర జేఏసీ కార్యచరణ ప్రకటించింది. దాంట్లో భాగంగా ఆదివారం గద్వాల సమ్మె శిబిరం నుండి రాజివ్ మార్గ్ గుండా ర్యాలీగా బయలుదేరి, చింతలపేట నందు గల గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి, అక్కడే మౌనదీక్ష పాటించి తిరిగి వచ్చి గాంధీ మహాత్ముని పటం పెట్టుకుని మౌన దీక్ష సాగించడం అయినది. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ కో కన్వీనర్లు ఎం వెంకటేశ్వర్లు, కావాలి మహేష్, ఎం శివశంకర్, గద్వాల మండల కార్యదర్శి కావలి గోవర్ధన్, కేటిదొడ్డి మండల కార్యదర్శి కొండయ్య, పాగుంట మండల కార్యదర్శి వినోద్, ఇటిక్యాల మండలం నాయకులు గోపన్న, సింగోటం గట్టు మండల అధ్యక్ష కార్యదర్శులు తిప్పన్న, తిరుమలేష్ గద్వాల మండలం వీఆర్ఏలు శ్రీనివాసులు, రాములు, నర్సింహులు, వీరన్న, మొగిలన్న తదితర వీఆర్ఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.