శివాలయంలో చోరీ... రూ.70 వేల నగదు అపహరణ ....

Submitted by bathula radhakrishna on Sun, 16/10/2022 - 08:58
Yellandu muncipality

ఇల్లందు ప్రధాన రోడ్డు వెంబడి ఉన్న శివాలయంలో దొంగలు పడిన ఘటన ఆదివారం  తెల్లవారుజామున జరిగింది.ఆలయ పూజారులు తెలిపిన వివరాల ప్రకారం  శివాలయం మరమ్మత్తుల పనుల నిమిత్తం ఆలయంలోని బీరువాలో ఉంచిన రూ.70 వేల నగదు దొంగిలించినట్లు తెలిపారు.అంతేకాకుండా ఆలయంలో శివుడు, అమ్మ వారు,వెంకటేశ్వర స్వామి గుడిల తాళాలను సైతం పగలకొట్టారని పేర్కొన్నారు.3 హుండీలను ధ్వంసం చేసి కొంత చిల్లరను అపహరించినట్లు తెలిపారు. చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇల్లందు సిఐ బాణోత్ రాజు సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులకు సమాచారం ఇస్తే గస్తీ నిర్వహించే అవకాశం ఉండేదన్నారు.క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పేర్కొన్నారు.                                               *కేవలం నగదు  అపహరణ*             శివాలయంలో జరిగిన చోరీలో దుండగులు కేవలం నగదు మాత్రమే అపహరణకు గురైంది.గుడిలో కొంత మేర వెండి వస్తువులు ఉన్నా కాని వాటిని దొంగిలించకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే గుడి మరమ్మత్తుల కొరకు ఆలయంలో నగదు ఉన్న విషయం తెలిసిన వారెవరైనా చేసి ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

Tags