శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:41
 Sharannavaratri festivities begin with a grandeur

కాజీపేట, సెప్టెంబర్26 (ప్రజాజ్యోతి)./... కడిపికొండ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయము లో 11వ శ్రీ శ్రీ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం జరిగాయి. ఉదయం 10గం లకు గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన, శ్రీ చక్రస్థాపన, అఖండ దీపారాధన, శ్రీ సూక్త షోడశోపచార పూజ, దీక్ష కంకణ ధారణ, హారతి తీర్థ ప్రసాద వితరణ జరిగింది. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయ పూజారి జగర్లపూడి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో శ్రీ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుటకు ఏర్పాటు జరుగుతున్నాయని, 30వ తేదీన శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు కుంకుమ పూజా కార్యక్రమం ఉంటుందని, సాయంత్రం 6 గంటలకు శాకంబరీ అలంకరణ ఉంటుందని, 1వ తేదీ న శనివారం రోజున ఉదయం 5 గంటలకు చండీ హోమం, మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం, 02వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు సరస్వతి పూజ, 03వ తేదీ సోమవారం రోజున సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక పూల ఆలంకరణ ఉంటుందని, భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.