తెగిపొయిన ఊట్కూరు-నందికొండవారిగూడెం తాత్కాలిక వంతెన

Submitted by venkat reddy on Wed, 28/09/2022 - 09:06
 The severed Ootkur-Nandikondavarigudem temporary bridge
  • -భారీ వర్షంతో పోంగిపోర్లుతున్న వాగులు వంకలు...
  • -రాజన్నగూడెం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నచిలక వాగు
  • -అకాల వర్షం కారణంగా నిండుకుండలా మారిన నిడమనూరు నల్లచౌవుట చెరువు 
  • -ఊట్కూరు నుంచి పలు గ్రామాలకు వెళ్లే దారిలో నిలిచిపోయిన రాకపోకలు ,ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు,ప్రయాణికులు

నిడమనూరు,సెప్టెంబర్27,(ప్రజాజ్యోతి) : అకాల  వర్షం కురువడంతో నిడమనూరు మండలంలోని పలు చోట్ల వాగులు వంకలు పోంగిపోర్లడంతో రహదారులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. వరద ఉదృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. అదేవిధంగా  నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జోరుగా వర్షం కురిస్తున్నది.నిడమనూరు మండలంలోని పలుగ్రామాలల్లో  కురిసిన వర్షానికి వాగులు, వంకలు వర్షంనీటితో పొంగి పొర్లుతున్నాయి. ఇదేవిధంగా నిడమనూరు మండలకేంద్రంలోని నల్లచౌవుట చెరువు వర్షం నీటితో నిండుకుండలా దర్శనం ఇస్తుంది .ఇదిలా ఉండగా నిడమనూరు మండలంలోని ఊట్కూరు గ్రామ శివారులోని కావేజీ శిధిలావస్థకు చేరడంతో వాహనాలు వెళ్లడానికి  (గూనలు)వేసి  తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు నిర్మాణం చేశారు. నాటి నుంచి నేటి వరకు భారీ వర్షాలు రాకపోవడంతో ప్రయాణికులకు ఏలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. కానీ సోమవారం మండలంలో ఒక్క రోజే ఇంతటి భారీ వర్షం కురవడంతో  వర్షాలకు వరద పోట్టెత్తడంతో   ఊట్కూరు గ్రామ శివారులో వాహనాలు వెళ్లడానికి వేసిన(గూనలు) వరద ఉదృతికీ గునల వెంట ఉన్న మట్టి కట్ట కొట్టుకుపోవడంతో పాటు  డైవర్షన్ రోడ్డు   పూర్తిగా దెబ్బతిందని రహదారి కోతకు గురికావడంతో వెంటనే స్థానిక ప్రజలు గుర్తించి,స్థానిక అధికారులకు,నాయకులకు, సమాచారం అందించారు. వెంటనే స్థానిక సర్పంచ్ నర్సింగ్ విజయ్ కుమార్ గౌడ్ కావేజి పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. నిడమనూరు  తాత్కాలిక వంతెన పై నుంచి ఊట్కూరు-నందికొండవారిగూడెం,వెళ్లడానికి రాకపోకలు నిలిపివేశారు. అదేవిధంగా నందికొండ వారిగూడెం ఊట్కూరు కి వెళ్లాలి అంటే లక్ష్మీ పురంవయా వెంకటాపురం నుంచి వంగాలగూడెం నల్లగొండ రోడ్డు ఉట్కూరు స్టేజి నుంచి ఊట్కూరు గ్రామానికి చేరుకోవచ్చని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. మారుపాక,ఊట్కూరు-బంటువారిగూడెం,ఎర్రబెల్లి, ముప్పారం  వైపు నుంచి నిడమనూరు రోడ్డుపై రాకపోకలు సాగుతున్నాయి. వాహనదారులు,ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అదేవిధంగా నిడమనూరు నల్లచౌవుట చెరువుకు వరద పోట్టెత్తడంతో నిడమనూరు చౌరువు నిండుకుండలా దర్శనమిస్తుంది. దీంతో పాటు అలుగు పోయడంతో చిలకలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వెనిగండ్ల,బంకాపురం,రాజన్నగూడెం కావేజి లవద్ద  కోతలకు గురికావడంతో అక్కడ కూడా రాకపోకలకు  అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా  పంట పోల్లాలోని  చిన్నచిన్న కాల్వలు కూడా వాగులా తలపించడంతో పంట పొలాలకు వెళ్లే దారిలో కాల్వలు పొంగి పొర్లుతున్నాయి.అదేవిధంగా నిడమనూరు మండలం ముప్పారం-గౌండ్లగూడెం,బంకాపురం-వెనిగండ్ల ,పార్వతీపురం-తుమ్మడం గ్రామాలతో పాటు చిన్న చిన్న వాగులు కూడా వర్షంనీటితో పొంగి పారుతున్నాయి. భారీ వర్షానికి చాలా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పలువురు నేతలు కోరుతున్నారు.