ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోయినపల్లి వినోద్ కుమార్ కు వినతి పత్రం

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:16
Seeking to solve the problems of teachers  Petition letter to Boinapally Vinod Kumar

మహబూబాబాద్ బ్యూరో అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి):  ఎన్నో రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్  కుమార్ ను కలిసి కలిసి వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఈ వినతి పత్రం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన స్పెషల్ డిఎస్ఏ 2002  కు చెందిన  220 మందికి చెందిన అప్రెంటిస్ కాలానికి చెందిన నాలుగు నెలల వేతనాల విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం వలన వేతనాలు అందలేదని తద్వారా నాలుగో నెలల సర్వీస్ నష్టపోతున్నామని వివరించడం జరిగినది, మరియు తెలంగాణ వ్యాప్తంగా, మరియు తెలంగాణ వ్యాప్తంగా 6000 మంది  ఉపాధ్యాయుల యొక్క సిపిఎస్ అమౌంట్ 2006వ సంవత్సరము నుండి 2010 వరకు కట్ చేయబడిన రూపాయలు ఒక్కొక్కరివే సుమారుగా 70 వేల రూపాయలు మిస్ లీనియస్ అకౌంట్లో జమ చేయబడినది, వాటిని వెంటనే జిపిఎఫ్ లోకి మార్చాలి, శిక్షణ పూర్తి చేసిన మే 2005 నుండి రెగ్యులర్ టైం స్కేల్ వర్తింపచేయాలి అని తదితర డిమాండ్లతో కుడిన వినతి పత్రమును సమర్పించగా, వినోద్ కుమార్ పరిశీలించి ప్రభుత్వానికి రిఫర్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మహబూబాద్ జిల్లా అధ్యక్షులు  చాగంటి ప్రభాకర్ నాయకులు పి తిరుపతి  ఏం వెంకట్ కే ప్రసాద్ ఏ రేణుక తదితరులు పాల్గొన్నారు.