తప్పుడు మార్గంలో వెళ్తున్న బొగ్గు లారీ సీజ్

Submitted by bathula radhakrishna on Sun, 30/10/2022 - 14:49
Yellandu

తప్పుడు మార్గంలో వెళ్తున్న బొగ్గు లారీని సీజ్ చేసినట్లు సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి తెలిపారు.ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మణుగూరు నుంచి కొత్తగూడెం,ఖమ్మం,సూర్యాపేట నుంచి లింగోజిగూడెం వెళ్ళవలసిన బొగ్గు లారీ ఇల్లందు మీదుగా వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది ఆపిన వేగంగా వెళ్లడం జరిగిందన్నారు. వెంటనే ప్రత్యేక టీమ్ ఆ బొగ్గు లారీని వెంబడించగా ముకుందాపురం వద్ద డ్రైవర్ లారీని వదిలి వెళ్లినట్లు తెలిపారు. మరొక డ్రైవర్ తో లారీని ఇల్లందు సెక్యూరిటీ కార్యాలయం ఉంచామని పేర్కొన్నారు.ఈ బొగ్గు లారీని మణుగూరు సెక్యూరిటీ విభాగానికి అప్పగించనున్నట్లు తెలిపారు.                                                    *అసలు బొగ్గు లారీకి అనుమతులు ఉన్నాయా..?*                                                మణుగూరు నుంచి ఖమ్మం మీదుగా లింగోజిగూడెం వెళ్లాల్సిన బొగ్గు లారీకి అన్ని అనుమతులు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మణుగూరు నుంచి ఖమ్మం మీదుగా వెళ్లాల్సిన బొగ్గు లారీ ఇల్లందుకు ఎందుకు వచ్చిందో తెలియని పరిస్థితి.ఒకవేళ బొగ్గు లారీకి అన్ని అనుమతులు ఉంటే డ్రైవర్ ఎందుకు లారీని వదిలేసి వెళ్లడనేది స్పష్టత రావాల్సి ఉంది.ఇల్లందు సెక్యూరిటీ అధికారులు మణుగూరు సెక్యూరిటీ విభాగానికి అప్పగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి...

Tags